
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు.