సాక్షి, హైదరాబాద్: ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ – 2023 ‘ఊర్మిళ చౌహాన్’ బంజారాహిల్స్‌లోని ‘ది స్కిన్ సెన్స్’లో సందడి చేశారు. దక్షిణాదిలో స్కిన్‌కేర్ రంగంలోకి మొదటిసారిగా తీసుకొచి్చన వినూత్న ప్లాస్మా టెక్నాలజీ ‘వేవ్‌మెడ్ పిక్సీ’ని ఊరి్మళ చౌహాన్ ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ ఆవిష్కరణలో ఊర్మిళ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి స్కిన్ కేర్ అవసరమని, ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో పిక్సీ వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రముఖ డెర్మటాలజిస్టు ‘డాక్టర్ అలెక్యా సింగపూర్’ వేవ్‌మెడ్ పిక్సీ అధునాతన సేవల గురించి వివరిస్తూ.. పిక్సీ ఇటలీకి చెందిన అధునాతన ప్లాస్మా టెక్నాలజీ. ఇది నాన్–ఇన్వాసివ్ సర్జరీ. భవిష్యత్ సేవలకు ఇది నాంది పలుకుతుందని అన్నారు. నాన్–సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్దతులను ప్రదర్శిస్తుందని, అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment