Chauhan
-
‘వేవ్‌మెడ్ పిక్సీ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ – 2023 ‘ఊర్మిళ చౌహాన్’ బంజారాహిల్స్‌లోని ‘ది స్కిన్ సెన్స్’లో సందడి చేశారు. దక్షిణాదిలో స్కిన్‌కేర్ రంగంలోకి మొదటిసారిగా తీసుకొచి్చన వినూత్న ప్లాస్మా టెక్నాలజీ ‘వేవ్‌మెడ్ పిక్సీ’ని ఊరి్మళ చౌహాన్ ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ ఆవిష్కరణలో ఊర్మిళ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి స్కిన్ కేర్ అవసరమని, ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో పిక్సీ వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రముఖ డెర్మటాలజిస్టు ‘డాక్టర్ అలెక్యా సింగపూర్’ వేవ్‌మెడ్ పిక్సీ అధునాతన సేవల గురించి వివరిస్తూ.. పిక్సీ ఇటలీకి చెందిన అధునాతన ప్లాస్మా టెక్నాలజీ. ఇది నాన్–ఇన్వాసివ్ సర్జరీ. భవిష్యత్ సేవలకు ఇది నాంది పలుకుతుందని అన్నారు. నాన్–సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్దతులను ప్రదర్శిస్తుందని, అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని పేర్కొన్నారు. -
ఆకాశమే హద్దుగా..
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్‌ను అభినందిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్‌గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్‌కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుయువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్ -
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
శరవేగంగా విస్తరిస్తున్న ఎల్రక్టానిక్స్ రంగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఎల్రక్టానిక్స్, టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021లో పీఎల్ఐ పథకం ప్రారంభించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే దేశంలో టెలికాం ఉత్పత్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2014–15లో రూ.1,80,000 కోట్లు ఉన్న ఎల్రక్టానిక్ పరికరాల ఉత్పాదన 2022–23 నాటికి రూ.8,22,000 కోట్లకు చేరుకుందన్నారు. 2014లో 78 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకోగా, మేడిన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 99.2 శాతం మొబైల్ ఫోన్ల తయారీ దేశంలోనే జరుగుతోందని మంత్రి వివరించారు. తూర్పు తీరంలో సమృద్ధిగా మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు తీర రాష్ట్రాల్లో మత్స్య సంపద నిల్వలు సమృద్ధిగా (97 శాతం) ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రచురించిన మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా–2022 నివేదికలో పేర్కొన్నట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2022లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన 135 ఫిష్ స్టాక్ ప్రాంతాల్లో 91.1% మంచి నాణ్యత, పరిమాణం గల చేపల లభ్యత ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఫిషరీస్ మెనేజ్మెంట్ పాలన వ్యవస్థ కింద ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా సముద్ర చేపల నిల్వల స్థితి అంచనా వేసి, అన్ని వివరాలతో కూడిన పూర్తి సమాచారం అందించడమే ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్వచించిన ప్రకారం చేపల పంట స్థాయి, సమృద్ధి ఆధారంగా బయోలాజికల్ స్థిరత్వం కోసం ఫిష్ స్టాక్స్ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో రాష్ట్రాలవారీగా ఫిష్ స్టాక్స్ అంచనా వేయలేదన్నారు. -
ట్రిపుల్ ఐటీ డీఎం అభివృద్ధికి కేంద్రం సహకారం
కర్నూలు కల్చరల్: ట్రిపుల్ ఐటీ డీఎం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటే‹Ùతో కలిసి ఆయన బుధవారం కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 151 ఎకరాల్లో రూ.300 కోట్లపైగా నిధులతో ట్రిపుల్ ఐటీ డీఎంను నిరి్మస్తుందని తెలిపారు. ఇక్కడ అసంపూర్తి పనులను త్వరలో పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే 5జీ యూజ్ కేస్ ప్రయోగశాలను ఇచ్చామన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంలో జరిగే రీసెర్స్ నాణ్యత ఐఐటీల కంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వీరి వెంట కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సుమన్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లిలో మొదలైంది. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అశోక్‌రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్‌కు బానిసై క్రికెట్ మొదలు హార్స్‌రైడింగ్‌వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్‌కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్‌రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. నాగోల్‌లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్‌పల్లిలోని భక్తినగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్‌లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు. హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది. యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు. -
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
సీడీఎస్‌గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్‌ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్‌ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. -
నెల రోజుల్లో 5జీ సర్వీసులు.. టెలికం సహాయ మంత్రి చౌహాన్ వెల్లడి
న్యూఢిల్లీ: చిరకాలంగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు నెల రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దేశీయంగా అభివృద్ధి, తయారు చేసిన పరికరాలు వినియోగంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. అటు 6జీ నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆసియా, ఓషియానియా ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్న రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్ఎస్ఎఫ్) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆగస్టు 1న ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్ముడైన స్పెక్ట్రంలో రిలయన్స్ జియో దాదాపు సగభాగం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు వేసింది. -
వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దేశంలోనే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌ను కూల్చి అక్కడ సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చి, చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తుచేశారని తెలిపారు. కష్టపడితేనే న్యాయవాదిగా గుర్తింపు: సీజే న్యాయవాద వృత్తిలో షాట్‌కట్స్ ఉండవని, కష్టపడిన వారికే మంచి గుర్తింపు లభిస్తుందని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. యువ న్యాయవాదులు కష్టపడాలని, సీనియర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో కూడా న్యాయమూర్తుల సహకారంతో కేసులను విచారించి ప్రజలకు సత్వర న్యాయం అందించామని తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ పనిచేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వివరించారు. న్యాయమూర్తులతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, తన కార్యాలయ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమా చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
రాజ్‌భవన్‌లో సీజేగా ప్రమాణస్వీకారం చేసిన చౌహాన్
-
ఫైన్‌తో సరిపెట్టేస్తే మరి నిబంధనలెందుకు?
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవన నిర్మాణాల విషయంలో జరిగిన ప్రతీ ఉల్లంఘననూ జరిమానాతో సరిపెట్టేస్తూ పోతుంటే, ఇక భవన నిర్మాణ నిబంధనలు ఉన్నది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. శాస్త్రీయంగా, ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ పేరుతో అనుమతిస్తూ పోతే, ఆ మాస్టర్ ప్లాన్, ఆ నిబంధనలు నిష్ప్రయోజనమని హైకోర్టు స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్‌కు, అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేయడం సమాజ క్రమబద్ధ అభివృద్ధిని అడ్డుకోవడమేనంది. ఆదిలాబాద్ జిల్లా, బాగులవాడకు చెందిన ఎ.రాజన్న అనే వ్యక్తి నిర్మించిన అక్రమ కట్టడాన్ని క్రమబద్ధీకరించేందుకు నిరాకరిస్తూ నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని, నాలుగో అంతస్తు నిర్మించడాన్ని తప్పుపట్టింది. ఆ వ్యాజ్యాన్ని నివేదించండి.. అక్రమ కట్టడాలకు జరిమానా విధించి, వాటిని భవన క్రమబద్ధీకరణ పథకం కింద క్రమబద్ధీకరించాలంటూ 2012లో అప్పటి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో హైకోర్టు విభేదించింది. ఈ ఉత్తర్వులు ఇదే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2012లో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తే, అక్రమ నిర్మాణాలు చేసుకుని, ఆ తర్వాత క్రమబద్ధీకరించుకుంటే సరిపోతుందనే భావనను పౌరుల్లో కలిగించినట్లవుతుందని, అందువల్ల ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా 2012 నాటి ఉత్తర్వులున్న నేపథ్యంలో, ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలంది. ఈ విషయంలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చౌహాన్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ భవనాన్ని కూల్చివేయరాదని అధికారులను ఆదేశించింది. అలాగే అదనంగా నిర్మించిన అంతస్తును ఉపయోగించరాదని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేం.. అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకునే వీలుందన్న పిటిషనర్ వాదనపై న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధించి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించమని 2012లో సింగిల్ జడ్జి ఉత్తర్వుల ఆధారంగా ఈ వ్యాజ్యంలో కూడా అటువంటి ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని జస్టిస్ కోదండరామ్ స్పష్టం చేశారు. త్రీ ఏసెస్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో ఎటువంటి ఉల్లంఘనలను మన్నించాలి.. ఎటువంటి వాటి విషయంలో చర్యలు తీసుకోవాలన్న విషయంలో ఇదే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం 1995లో తీర్పునిచ్చిందని, 2012లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఆ తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చదరపు అడుగు లేదా చదరపు గజం ఆధారంగా జన సాంద్రతను పరిగణనలోకి తీసుకుని కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురుగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. అయితే ఈ ఉల్లంఘనలు జరుగుతుంటే, అటువంటి సౌకర్యాలు సరిపోవని, అంతిమంగా అందరూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన చట్ట నిబంధనలు ఏపీ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్ట నిబంధనల కు విరుద్ధంగా ఉన్నాయా.. అన్న ప్రశ్న ఒక్కటే ఈ కోర్టు ముందు ఉత్పన్నమవుతోందన్నారు. క్రమబద్ధీకరణ చట్ట నిబంధనలను సవాల్ చేయకపోయినప్పటికీ, వాటి విషయంలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా కూడా ఈ వ్యాజ్యంపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉందంటూ.. ఫైళ్లను ఏసీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
సరస్సుల నగరాల.. సొగసులు కాపాడాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణ ముందుకు కదలకపోవడంతో ఇప్పుడు హైకోర్టే స్వయంగా రంగంలోకి దిగింది. సరస్సుల నగరంగా గతంలో ఉన్న ఖ్యాతిని నిలబెట్టి పూర్వవైభవం తెచ్చేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళణకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున ఓ న్యాయమూర్తి ఈ విధంగా చొరవ తీసుకుని సమావేశం జరపడం ఇదే మొదటిసారి. హైకోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరిగింది. సరస్సుల నగరాలుగా పేరుగడించిన హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, ఇప్పుడు ఆక్రమణలకు గురి కావడం, పరిశ్రమల వ్యర్థాలు, ఇతరాలతో అవి ఉనికిని కోల్పోవడంపై జస్టిస్ చౌహాన్ ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువులకు, మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపు విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు జస్టిస్ చౌహాన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు నెలల్లో మొదట ఓ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 405 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ చౌహాన్ దృష్టికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తీసుకొచ్చారు. లోక్ అదాలత్‌ల్లో అనుభవజ్ఞులైన మధ్యవర్తుల ద్వారా ఈ కేసులను పరిష్కరిస్తామని జస్టిస్ చౌహాన్ చెప్పారు. మూసీ ప్రక్షాళణ కోసం ఏం చేయాలో క్షేత్రస్థాయి పరిస్థితులతో మూడు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ హామీ ఇచ్చారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నామో వివరిస్తూ నివేదిక ఇస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో, క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో మరోసారి సమావేశం అవుదామని అధికారులందరూ హామీ ఇచ్చారు. చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణకు చెందిన వ్యవహారాలను ఇకపై న్యాయసేవాధికార సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని జస్టిస్ చౌహాన్ వారికి స్పష్టంచేశారు. -
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ గురువారం ప్రమాణం చేశారు. జస్టిస్ చౌహాన్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. సీజే కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, జస్టిస్ చౌహాన్ కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ చౌహాన్ మరో న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కలిసి కేసులను విచారించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జస్టిస్ చౌహాన్‌ను తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాద సంఘాలు ఘనంగా సన్మానించాయి. -
బిషన్‌సింగ్, చేతన్ చౌహాన్‌లపై గౌతీ ఫైర్..
న్యూఢిల్లీ : ఆటగాడిగా గౌతమ్ గంభీర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతని మాటల్లో కూడా అంతే పదును కనిపిస్తుంది. ఇక తాను అండగా నిలిచిన ఒక ఆటగాడి రాష్ట్రం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అతను ఊరుకుంటాడా! తాజాగా అతని మాటలు దీనిని మరోసారి నిరూపించాయి. అఫ్గానిస్తాన్‌తో టెస్టు కోసం ఢిల్లీ పేసర్ నవదీప్ సైని భారత జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పుట్టిన సైని రంజీల్లో ఢిల్లీ తరఫునే ఆడినా... దిగువ స్థాయి క్రికెట్లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అతడు ‘బయటి వ్యక్తి’ అంటూ గతంలో బిషన్‌సింగ్ బేడి, చేతన్ చౌహాన్ విమర్శించారు. సైనిని ఢిల్లీకి ఆడించడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌పై కూడా వ్యతిరేకత కనబర్చారు. తాజాగా సైని ఎంపికను నిరసిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు కరపత్రాలు పంచడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ‘బయటి వ్యక్తి సైని భారత జట్టుకు ఎంపిక కావడంపై ఢిల్లీ సభ్యులు బేడి, చౌహాన్‌లకు నా సానుభూతి. నల్ల బ్యాండ్లు బెంగళూరులో కూడా ఒక్కో రోల్‌కు రూ. 225 చొప్పున లభిస్తున్నాయని నాకు తెలిసింది. సైని ముందుగా భారతీయుడు, ఆ తర్వాతే అతని రాష్ట్రం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. -
నిఫ్ట్ ఛైర్మన్ గా చేతన్ చౌహాన్
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ చేతన్ చౌహాన్.. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (నిఫ్ట్) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వైస్ ప్రెసిడెంట్, సీనియర్ బీసీసీఐ అధికారిగా ఉన్న చౌహాన్.. సొంతంగా ఓ క్రికెట్ అకాడమీని నడపడంతో పాటు, న్యూస్ ప్రింట్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. తనను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించినందుకు చౌహాన్ ప్రధానమంత్రి మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు చాలాకాలం పాటు ఓపెనింగ్ పార్టనర్ గా ఉన్న చౌహాన్, రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. నిఫ్ట్ చట్టం 2006 ప్రకారం ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతిక లేదా వృత్తిపరమైన అనుభవం ఉన్నవారిని ఈ పదవిలో నియమిస్తారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ప్రస్తుతం నిఫ్ట్ ఛైర్మన్ గా నియమితులైన 68 ఏళ్ల చౌహాన్.. తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు ఇంతకు ముందు డీడీసీఏ విషయంలో అవినీతి అభియోగాలు ఎదుర్కొన్న చౌహాన్ ను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లా కమిషన్ ఛైర్మన్ గా బల్బీర్ సింగ్
21వ లా కమిషన్ చైర్మన్ గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. గత సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టులో ప్రభుత్వం చౌహాన్ ను భర్తీ చేసినట్లు న్యాయశాఖామంత్రి డి వి సదానందగౌడ ఓ ట్వీట్ లో తెలిపారు. 66ఏళ్ళ జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం కావేరీనది నీటి వివాదల ట్రిబ్యునల్ లో ఉన్నారు. జస్టిస్ చౌహాన్ 2009 నుంచి 2014 జూలై వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన జూలై 2008 నుంచి 2009 మే వరకూ ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి చైర్మన్ పోస్ట్ ఖాళీగానే ఉండగా... లా ప్యానెల్ సభ్యులుగా గతేడాది మేలో పదవీ విరమణ చేసిన 62 ఏళ్ళ గుజరాత్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి రవి ఆర్ త్రిపాఠీని నియమించారు. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లోనే ఉన్న లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక మాత్రం అనేక కారణాలతో ఆలస్యం అవుతూనే వచ్చింది. లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక కోసం గతేడాది ప్రధానమంత్రి కార్యాలయానికి... న్యాయ మంత్రిత్వ శాఖ 48 మంది హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల జాబితాను పంపింది. 20వ లా కమిషన్ ఛైర్మన్ పదవీకాలం గత ఆగస్టు 30 తో పూర్తవ్వడంతో సెప్టెంబర్ 9 నాటికి 21వ లా కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసేందుకు అప్పట్లో న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నాటికే 21వ లా ప్యానెల్ సృష్టించాలని ప్రకటన కూడ ఇచ్చింది. అయితే అప్పటినుంచీ పెండింగ్ లో ఉన్న లా కమిషన్ చైర్మన్ పదవిలో చివరికి బల్బీర్ సింగ్ చౌహాన్ ను నియమించినట్లు వెల్లడించింది. -
వాళ్లేం తప్పు చేయలేదు!
సుష్మ, రాజే, చౌహాన్‌కు దన్నుగా నిలిచిన బీజేపీ న్యూఢిల్లీ: వ్యాపమ్, లలిత్‌గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు దన్నుగా నిలవాలని బీజేపీ నిర్ణయించింది. వారు ఎలాంటి తప్పు చేయలేదని, రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. బుధవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సుమారు 45 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేంద్రం చేపడుతున్న మంచి పనులతో పార్టీ ఎంపీలు సగర్వంగా తలెత్తుకోవాలన్నారు. పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజాయితీతో చక్కగా పనిచేస్తున్నారని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కితాబిచ్చారు. లలిత్‌కు ఎలాంటి సాయం చేయలేదు లలిత్ మోదీకి ఎలాంటి సాయం చేయలేదని సుష్మ ఎంపీలకు వివరించినట్లు భేటీ అనంతరం పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలిపారు. ‘నేను ఆయనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూర్చలేదు. భారత్ నుంచి పారిపోయేందుకు సాయపడలేదు. ఆయనకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఏనాడూ అడగలేదు. భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపకుండా లలిత్ అంశంపై నిర్ణయం తీసుకోవాలని మాత్రమే బ్రిటిష్ అధికారులకు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ గోరంతను కొండంత చూపేందుకు యత్నిస్తోంది’ అని సుష్మ అన్నట్లు నఖ్వీ పేర్కొన్నారు.