
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ గురువారం ప్రమాణం చేశారు. జస్టిస్ చౌహాన్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. సీజే కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, జస్టిస్ చౌహాన్ కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
అనంతరం జస్టిస్ చౌహాన్ మరో న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కలిసి కేసులను విచారించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జస్టిస్ చౌహాన్‌ను తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాద సంఘాలు ఘనంగా సన్మానించాయి.
Comments
Please login to add a commentAdd a comment