![Center contribution to the development of triple IT DM - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/9/iit.jpg.webp?itok=2-76KBuA)
కర్నూలు కల్చరల్: ట్రిపుల్ ఐటీ డీఎం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటే‹Ùతో కలిసి ఆయన బుధవారం కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 151 ఎకరాల్లో రూ.300 కోట్లపైగా నిధులతో ట్రిపుల్ ఐటీ డీఎంను నిరి్మస్తుందని తెలిపారు.
ఇక్కడ అసంపూర్తి పనులను త్వరలో పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే 5జీ యూజ్ కేస్ ప్రయోగశాలను ఇచ్చామన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంలో జరిగే రీసెర్స్ నాణ్యత ఐఐటీల కంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వీరి వెంట కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment