
ముంబై/సాన్‌జువాన్: మిస్ వరల్డ్–2021 పోటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మిస్ ఇండి యా మానస వారణాసి (23) సహా పలువురు పోటీదారులు, సిబ్బంది కోవిడ్ బారినపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్యూర్టోరికోలోని సాన్ జువాన్‌లో డిసెంబర్ 16న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమాన్ని రానున్న 90 రోజుల్లో రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు.
కరోనా బారిన పడిన పోటీదారులు, సిబ్బందిని ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు వెంటనే క్వారంటైన్‌కు తరలించి, వైద్యపరీక్షలు, అవసరమైన చికిత్సలు చేపట్టినట్లు తెలిపారు. వీరందరూ కోలుకున్న తర్వాత, మరోసారి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలితే వారి వారి దేశాలకు పంపిస్తామని ‘మిస్ వరల్డ్’ సీఈవో జులియా మోర్లే పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన మానస భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టోరికో వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment