
మిస్ హిట్లర్!
సమ్‌థింగ్ స్పెషల్
‘మిస్ ఇండియా’, ‘మిస్ అమెరికా’ల పేర్లతో అందాల పోటీలు జరగడం అందరికీ తెలిసిన విషయమే. మరి మధ్యలో ఇదేమిటి? అదేనండీ... మిస్ హిట్లర్! దేశాల పేర్లతోనే కాదు... వ్యక్తి పేరుతో కూడా ‘మిస్’పోటీలు జరుగుతాయని చెప్పడానికి ‘మిస్ హిట్లర్’ పోటీ నిదర్శనం. బ్రిటన్‌లోని ‘నేషనల్ యాక్షన్’ అనే ఫాసిస్ట్ గ్రూప్ నిర్వహించిన ఈ పోటీలో ఒక స్కాటిష్ యువతి (పేరు గోప్యంగా ఉంచారు) ‘మిస్ హిట్లర్’ కిరీటాన్ని దక్కించుకుంది. ‘మిస్’ కిరీటం అంటే అందచందాలు, ఆరోగ్యం గుర్తుకు వస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. జాత్యహంకార భావాలను ఎక్కువగా ఎవరు ప్రదర్శిస్తారో... వారే ఈ కిరీటానికి అర్హులు.