‘మిస్‌ ఇండియా’ విడుదల ఎప్పుడంటే | Keerthy Suresh Miss India Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

కీర్తి సురేష్‌ ‘మిస్‌ ఇండియా’ రిలీజ్‌ ఎప్పుడంటే

Published Mon, Mar 9 2020 12:24 PM | Last Updated on Mon, Mar 9 2020 12:47 PM

Keerthy Suresh Miss India Movie Release Date Confirmed - Sakshi

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్‌. ఈ మలయాళీ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఏప్రిల్‌ 17న సినిమా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (కీర్తి సురేష్‌ ‘మిస్‌ ఇండియా పాట విన్నారా) 

‘‘మేము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ మ్యాజిక్‌ ఉంటుంది. మా టీం అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ కీర్తి ఆదివారం ట్వీట్‌ చేశారు. ఇక కీర్తి సురేష్‌ సినిమా చేయక దాదాపు సంవత్సరం దాటింది. గతేడాది టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నటించిన మన్మథుడు-2లో కనిపించినప్పటికీ.. అందులో అతిథిగానే కనిపించారు. అయితే ‘మిస్‌ ఇండియా’ సినిమాలో మల్టిపుల్‌ పాత్రల్లో కీర్తి కనిపించనున్నట్లు సమాచారం. అలాగే.. ఈ సినిమా కోసం కీర్తి బరువు తగ్గారు. కాగా ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర​ ప్రసాద్‌, నరేష్‌​, భాను శ్రీ మెహ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement