
గతాన్ని గుర్తు చేసుకోవద్దు
గత జీవితాన్ని గుర్తు చేసుకోవడం శ్రేయస్కరం కాదు అంటున్నారు అందాలరాశి ఐశ్వర్యారాయ్. మిస్ ఇండియా కిరీటాన్ని పొందిన తరువాత ఈ బ్యూటీ నటిగా చిత్ర రంగప్రవేశం చేసి చాలా మంది హీరోలతో కలిసి నటించారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఇతర నటీమణుల మాదిరిగానే ఐశ్యర్యారాయ్‌పైనా వదంతులు చాలానే ప్రచారం అయ్యాయన్నది గుర్తు చేయనక్కర్లేదు. కోలీవుడ్‌లోనూ ఇరువర్, జీన్స్, కండుకొండేన్ కండుకొండేన్, రావణన్,ఎందిరన్ చిత్రాలలో నటించిన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న తరువాత చిత్రాల్లో నటించడం తగ్గించుకున్నారు.
వీరికి నాలుగేళ్ల కూతురుంది. కొంత గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ రెండవ ఇన్నింగ్‌ను తన తొలి చిత్ర దర్శకుడైన మణిరత్నం చిత్రంతో ప్రారంభించాలని ఐష్ భావించారు. ఆయన చిత్రం ఆలస్యం కావడంతో ఇప్పుడు హిందీలో జాస్పా అనే చిత్రంలో నటిస్తున్నారు. సమీప కాలంలో మంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యారాయ్ ఈ వయసులోనూ చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ సౌందర్య రహస్యమేమిటన్న విలేకరి ప్రశ్నకు బదులిస్తూ గత జీవితాన్ని తిరిగి చూడకుండడమే తన సౌందర్య రహస్యం అన్నారు.
తన జీవితంలో చాలా విషయాలు జరిగాయని అన్నారు. అవన్నీ మరచి కొత్త జీవితాన్ని గడుపుతున్నాన్నారు.అయినా తానిప్పుడు వివాహితను. తన కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుకోవలసిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఎవరయినా ప్రేమలో పడుండవచ్చు. కళాశాలలో చదివేటప్పుడు ప్రేమలో పడడం అన్నది సహజం అన్నారు. అయితే దాని నుంచి బయట పడ్డ తరువాత మళ్లీ దాన్ని గుర్తు చేసుకోవడం మంచిది కాదని ఐశ్వర్యారాయ్ అన్నారు.