
ఇషా గుప్తా అందానికేం తక్కువ లేదు. మిస్ ఇండియా ఇంటర్నేషనల్. ఇషా గుప్తా సినిమాలకేం తక్కువ లేవు. ఈ ఇయర్ ఒకటి రిలీజ్ అయింది. రెండు షూటింగ్‌లో ఉన్నాయి. ఇషా గుప్తా ఫిట్‌నెస్‌కేం తక్కువ లేదు. ముప్పై రెండేళ్ల వయసులోనూ ట్వంటీ ప్లస్‌లా ఉన్నారు. ఇంకేం కావాలి ఈ అమ్మాయికి. ఇంకా ఇంకా ఫిట్‌నెస్ కావాలట! మంకీకి ఉండే ఫిట్‌నెస్, పీతకు ఉండే ఫిట్‌నెస్, తొండకు, బాతుకు, గుర్రానికీ... ఇలా జంతువులకు ఉండే ఫిట్‌నెస్ అంతా కావాలట! అందుకే కొన్ని నెలలుగా బికాస్ బారువా అనే ట్రైనర్ దగ్గర ‘యానిమల్ వాకింగ్’ అనే ఎక్సర్‌సైజ్ చేస్తోంది.
ఒక్కోరకం జంతువు ఒక్కోలా నడుస్తుంది. నడుస్తున్నప్పుడు వాటి బాడీ మూవ్‌మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీతలా నడిస్తే భుజాలు గట్టి పడతాయి. నడుము సన్నబడుతుంది. తొండలా నడిస్తే ట్రైసెప్స్ పెరుగుతాయి. అలా ఇషా గుప్తా అన్ని జంతువుల్నీ ఫాలో అయి, తన బాడీలోని ఒక్కోపార్ట్‌నీ ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. తన న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటో ఇంకా బయట పెట్టలేదు ఇషా. చెప్పలేం, ఈ ఏడాది ఆమె ఒక ‘యానిమల్ వాకింగ్’ సెంటర్‌ని ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. హ్యాపీ ఫిట్‌నెస్ ఇయర్ ఇషా!
Comments
Please login to add a commentAdd a comment