
వర్షశర్మను సన్మానిస్తున్న ఎమ్మెల్యే రామన్న
ఎదులాపురం(ఆదిలాబాద్): మిసెస్ ఇండియా అందాల పోటీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వర్షశర్మ రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ నెల 2న ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ పనాషే ముంబాయిలో మిసెస్ ఇండియా పోటీ నిర్వహించగా వర్షశర్మ 35 మందితో పోటీపడి మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న శనివారం వర్షశర్మను శాలువాతో సన్మానించి సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ పట్టణానికి చెందిన వర్షశర్మ అందాల పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలవడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. అనంతరం వర్షశర్మ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకూడదన్నారు. ప్రయత్నిస్తే మహిళలు రాణించలేని రంగమంటూ లేదన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు సాయిని రవి, దేవన్న, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment