
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ.
''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.
చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్
నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్‌గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది.
చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Comments
Please login to add a commentAdd a comment