favourite hero
-
సౌత్, నార్త్పై మిస్ ఇండియా సినీ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ. ''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్‌గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
భర్తే తన ఫేవరెట్ అంటున్న నటి
అందానికే అసూయ పుట్టించే అందగత్తే ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఈ మాజీ ప్రపంచ సుందరిని ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి ఒకసారైనా నటించాలని హీరోలు అందరూ కోరుకుంటారు. మరి ఇంతకు ఈ ముద్దుగుమ్మకు ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్ బచ్చనే. ఈ విషయాన్ని ఐష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. సూపర్‌స్టార్ కొడుకైనప్పటికి అభిషేక్‌లో ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే తనలో నాకు నచ్చిన విషయం. ఇప్పటికీ మా ఇద్దరితో సినిమాలు తీయడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాన’ని ఐశ్వర్యరాయ్ తెలిపారు. గతంలో వీరిద్దరూ ‘గురు’, ‘ఉమ్రావ్ జాన్’, ‘రావణ్’, ‘కుచ్ నా కహో’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఐష్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు హాజరయ్యారు. తల్లీకూతుళ్లిద్దరూ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా రాజ్‌కుమార్ రావ్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. మరోపక్క అభిషేక్ బచ్చన్ ‘మన్మర్జియా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. -
అభిమాన హీరోతో శింబు
ప్రస్తుతం మల్టీస్టారర్ల చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. దీంతో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించడానికి దర్శకులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇటీవల శింబు, భరత్ నటించి న వానం, ఆర్య, జయ్ నటించిన రాజారాణి, అజిత్, ఆర్య నటించిన ఆరంభం వంటి చిత్రాల సక్సెస్ మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపిరి పోసిందనే చెప్పాలి. తాజా గా అజిత్, విధార్థ్ నటించిన వీరం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. లేటెస్ట్గా ఆర్య, విజయ్‌సేతుపతి హీరోలుగా పురంబోకు చిత్రం తెరకెక్కనుంది. ఇదే కోవ లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ చిత్రంలో అజిత్, శింబు కలిసి నటించనున్నారన్నది తాజావార్త. దీని కి గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ అజిత్ కు కథ వినిపించినప్పు డు అందులో ఒక పాత్రను శింబు పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అందుకు గౌతమ్‌మీనన్ అంగీకరించడంతో వెంటనే అజిత్ శింబుకు ఫోన్ చేసి తనతో కలిసి నటించాలని కోరారట. అజిత్ వీరాభిమానినని తరచూ చెప్పుకునే శింబు ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో మరో మాట లేకుండా ఓకే చెప్పేశారట. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.