అభిమాన హీరోతో శింబు | With your favourite hero Simbu | Sakshi
Sakshi News home page

అభిమాన హీరోతో శింబు

Published Sat, Dec 14 2013 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

అభిమాన హీరోతో శింబు

అభిమాన హీరోతో శింబు

 ప్రస్తుతం మల్టీస్టారర్‌ల చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. దీంతో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించడానికి దర్శకులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇటీవల శింబు, భరత్ నటించి న వానం, ఆర్య, జయ్ నటించిన రాజారాణి, అజిత్, ఆర్య నటించిన ఆరంభం వంటి చిత్రాల సక్సెస్ మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపిరి పోసిందనే చెప్పాలి. తాజా గా అజిత్, విధార్థ్ నటించిన వీరం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. లేటెస్ట్‌గా ఆర్య, విజయ్‌సేతుపతి హీరోలుగా పురంబోకు చిత్రం తెరకెక్కనుంది. ఇదే కోవ లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ చిత్రంలో అజిత్, శింబు కలిసి నటించనున్నారన్నది తాజావార్త. దీని కి గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు.
 ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ అజిత్ కు కథ వినిపించినప్పు డు అందులో ఒక పాత్రను శింబు పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అందుకు గౌతమ్‌మీనన్ అంగీకరించడంతో వెంటనే అజిత్ శింబుకు ఫోన్ చేసి తనతో కలిసి నటించాలని కోరారట. అజిత్ వీరాభిమానినని తరచూ చెప్పుకునే శింబు ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో మరో మాట లేకుండా ఓకే చెప్పేశారట. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement