Sini Shetty
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు
గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి. అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్ -
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన 71వ మిస్ వరల్డ్ అందమైన భామలు (ఫొటోలు)
-
మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!
భారతదేశం మిస్ వరల్డ్ 2023 అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలు భారత్‌లో నిర్వహించనుండటం విశేషం. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ నవంబర్ జరుగనుందని తెలుస్తోంది. భారత్ చివరిసారిగా 1996లో ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇన్నేళ్ల విరామం తర్వాత భారత్‌కి ఈ ప్రపంచ వేదికపై తన ఆతిధ్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించే గొప్ప అవకాశం ఇది. ఇక ఈ అందాల పోటీల్లో భారత్ తరుఫున ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తన తోటి సోదరిమణులకు భారతదేశం అంటే ఏమిటో, ఇక్కడ ఉండే వైవిధ్య సంప్రదాయాలు, విలువలను ప్రదర్శించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని పేర్కొంది. కచ్చితంగా మన సంప్రదాయాలు, ఆతిథ్యం చూసి ముగ్ధులవుతారని నమ్మకంగా చెప్పింది. అలాగే వాళ్లకు ఇక్కడ గడపడం నచ్చుతుందని అన్నారు. ఎవరీ సినీ శెట్టి.. కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. ఆమె మిస్ ఇండియా 2022 పోటీలో కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సినీ శెట్టి అకౌంటింగ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. ప్రస్తుతం ఆమె సీఎఫ్ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినీ శెట్టి తన 14 ఏటనే భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది. ఇక ప్రియాంకా చోప్రా తన రోల్ మోడల్ అని తెలిపింది. (చదవండి: శాకాహారం మాత్రమే తీసుకుంటే..ఈ సమస్యలు వస్తాయట..!) -
భారత్‌లో మిస్ వరల్డ్ 2023
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్–2023కు భారత్ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది. ‘71వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్ ఫైనల్లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు. #WATCH | Miss World 2022 Karolina Bielawska speaks on Miss World 2023 to be held in India. pic.twitter.com/fPxIK736MU — ANI (@ANI) June 8, 2023 -
సౌత్, నార్త్పై మిస్ ఇండియా సినీ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ. ''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్‌గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం
ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. 21 ఏళ్ల సిని శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ‘మిస్ ఇండియా 2022’ కిరీటాన్ని గెలుచుకుంది. చూడబోతే తుళు స్త్రీల శిరస్సులు అందాల కిరీటాల కోసమూ వారి అధరాలు విజయ దరహాసాల కోసమూ పుడుతున్నట్టున్నాయి. ఆదివారం ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. రాజస్థాన్‌కు చెందిన రుబుల్ షెకావత్ మొదటి రన్నర్ అప్‌గా నిలువగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచింది. భారీ హైబ్రిడ్ ఈవెంట్ నేరుగా జరిగే ఈవెంట్లో ఆన్లైన్ ద్వారా కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తే అలాంటి ఈవెంట్‌ని ‘హైబ్రిడ్ ఈవెంట్’ అంటారు. అంటే డైరెక్ట్‌గా వర్చువల్‌గా కూడా జరిగే ఈవెంట్ అన్నమాట. ‘మిస్ ఫెమినా ఇండియా 2022’ ఈవెంట్ కూడా ఈ విధంగానే జరిగింది. జూరీలో నేహా దూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్‌తో పాటు మన మిథాలీ రాజ్ కూడా ఉంది. వీరి పరీక్షలన్నింటిని దాటి సిని విజేతగా నిలిచింది. దీని వల్ల ఆమె ఈ సంవత్సరం జరగనున్న 71వ ‘విస్ వరల్డ్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. సిని శెట్టి ఎవరు? కర్నాటకలో మూలాలున్న తుళు కుటుంబం నుంచి వచ్చిన సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలోనే పుట్టి అక్కడే పెరిగింది. తల్లి పేరు హైమా శెట్టి. సోదరుడు షికిన్ శెట్టి. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే సిని ముందు నుంచి మోడలింగ్ అంటే ఇష్టపడింది. ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొంది ఆమెలాగే ఎదగాలనుకుంది. మంచి భరతనాట్యం డాన్సర్. మోడల్. ఇన్‌స్టాలో ఆమె అకౌంట్ దాదాపు 60 వేల మంది ఫాలోయెర్లు ఉన్నారు నిన్న మొన్నటి దాకా (ఇప్పుడు లక్షల్లో మారుతుంది). ఇన్‌స్టాలో సిని చేసే డాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘మాది స్త్రీల విషయంలో సమకాలీన ధోరణి ఉన్న కుటుంబమే అయినా మా సమూహం స్త్రీల విషయంలో సంప్రదాయ విలువల గురించి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఆ విలువలు స్త్రీల విషయంలోనే పట్టింపుతో ఉండటం నేను గమనించాను. స్త్రీ జీవితం అంటే ఏమిటో నాదైన ఒక విలువను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నేను ఉండే (మోడలింగ్) రంగంలో స్త్రీలు సంప్రదాయ–ఆధునిక పోకడల మధ్య నలుగుతూ నిలవడం పెద్ద సవాలు. కాని సవాళ్లను ఎదుర్కొనే తత్త్వం వల్లే నేను ఈనాడు ఇక్కడ నిలుచుని ఉన్నాను’ అని సిని అంది. మరిచిపోలేని జ్ఞాపకం ‘మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?’ అని అడిగితే సిని శెట్టి తన భరతనాట్యం అరంగేట్రం గురించి చెప్పింది. ‘నాకు డాన్సంటే చాలా ఇష్టం. అది శరీరాన్ని, ఆత్మను సంలీనం చేస్తుంది. అది ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందువల్ల నేను ఆరంగేట్రం చేసిన రోజును మర్చిపోలేను. అది నా సంస్కృతితో నేను అనుబంధం ఏర్పరుచుకున్న రోజుగా భావిస్తాను. నా భుజాల నుంచి చెమట కారిపోతున్నా, నా కొప్పుముడిలోని పూసలు ఊడి వేళ్లాడుతున్నా డాన్స్ చేస్తున్నందుకు నా లోలోపల ఉబికిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మూడు గంటలు ప్రేక్షకుల ముందు డాన్స్ చేసి చివరన భూదేవికి పెట్టిన నమస్కారంతో ధన్యురాలిని అయ్యాను’ అని చెప్పింది సిని. త్వరలో ఆమె ఏదైనా భారీ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. -
ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి (ఫొటోలు)
-
Femina Miss India 2022: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Karnataka Sini Shetty Crowned Femina Miss India World 2022: మగువల అందాన్ని నిర్వచించలేం. కానీ వారి కురులను కారు మబ్బులుగా, మోమును చంద్రబింబంలా, కళ్లను కలువపూలుగా ఇలా వివిధ రకాలుగా పోల్చగలరు, అభివర్ణించగలరు కవులు. అయితే ఫ్యాషన్ రంగంలో మాత్రం అందాన్ని వివిధ రౌండ్స్ వారీగా అంచనా వేస్తారు. ఈ విభాగాలకు రకరకాల పేర్లు పెట్టి ఒకర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా ఎంపిక చేస్తారు. అలాంటి ఈ ఫ్యాషన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేది 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది. అన్నీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీ శెట్టి అందంలో విజేతగా నిలిచింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు ఆదివారం (జులై 3) అట్టహాసంగా ముగిసాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కనులవిందుగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్స్ నేహా ధూపియా, మలైకా అరోరా, డినో మోరియా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ శియామక్ దావర్, మాజీ క్రికేటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో సినీ శెట్టి విజేత కాగా, రాజస్థాన్‌కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. విజేతగా ఎంపికైన తర్వాత 21 ఏళ్ల సినీ శెట్టి మాట్లాడుతూ.. 'ఈ జర్నీని నేనేప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని తెలిపింది. సినీ శెట్టి కిరీటాన్ని సోంతం చేసుకోవడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. When dreams turned into reality 👑 . . . . .#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Danced for Thalapathy's Vaathi Coming during the DANCES OF INDIA segment in the Miss India Competition last night 🔥💥 . . .#SiniShetty #MissIndiaFinale2022 #ThalapathyVijay𓃵 #Varisu #MissIndia2022 #Thalapathy67 #FeminaMissIndia2022 #Thalapathy66 #LokeshKanagaraj #VaathiComing pic.twitter.com/ZYexh43Qtc — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Thanks for all your lovely wishes 🥺🙏🏼 I hope I made Karnataka proud. Can't wait to start this new journey and make India proud 🇮🇳🤞🏼 Keep showering all your love and blessings and I love y'all ❤️#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/x3oRvXdBa0 — Sini Shetty (@sini_shetty) July 4, 2022