భారత్‌లో మిస్‌ వరల్డ్‌ 2023 | India set to host 71st Miss World 2023 | Sakshi
Sakshi News home page

భారత్‌లో మిస్‌ వరల్డ్‌ 2023

Published Fri, Jun 9 2023 6:12 AM | Last Updated on Fri, Jun 9 2023 5:40 PM

India set to host 71st Miss World 2023 - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్‌ వరల్డ్‌–2023కు భారత్‌ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్‌ వేదికైంది. ‘71వ మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌కు భారత్‌ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్‌ ఫైనల్‌లో ప్రదర్శించనున్నారు’అని మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్‌ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్‌ ఇండియా వరల్డ్‌ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement