Miss India Worldwide
-
మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేతగా ధ్రువీ పటేల్
భారత్ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిశాయి. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024’గా ధ్రువీ పటేల్ ఎన్నికైంది.న్యూ జెర్సీ ఎడిసన్‌లో జరిగిన ఈవెంట్లో ఆమెకు కిరీటం దక్కింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యనభ్యసిస్తోంది.మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ టైటిల్ కైవసం చేసుకోవడాన్ని తానొక ఉన్నత గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారామె. ఈ సందర్భంగా.. బాలీవుడ్ నటిగా, యూనిసెఫ్ అంబాసిడర్‌గా రాణించాలని ఉందని ఈ సందర్భంగా తెలిపిందామె. ఈ సెగ్మెంట్లో.. సురినామ్‌కు చెందిన లీసా అబ్డోల్హక్ ఫస్ట్ రన్నరప్‌గా, నెదర్లాండ్స్ మాళవిక శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.VIDEO | Dhruvi Patel, a Computer Information System student from USA, has been declared as the winner of Miss India Worldwide 2024, the longest running Indian pageant outside India.READ: https://t.co/uUWwqEGEE3(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/z3ZLY7zwba— Press Trust of India (@PTI_News) September 20, 2024ఇక.. మిస్టర్స్ కేటగిరీలో ట్రినిడాడ్ టోబాగోకు చెందిన సువాన్ మౌట్టెట్ విజేతగా నిలవగా, యూకేకు చెందిన స్నేహ నంబీయార్ ఫస్ట్ రన్నరప్‌గా, యూకేకు చెందిన పవన్‌దీప్ కౌర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.మిస్ టీన్ వరల్డ్‌వైడ్ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సూరెట్ టైటిల్ దక్కించుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిశ్రేయా సింగ్ తొలి రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధ టెడ్జోయ్ రెండో రన్నరప్‌గా నిలిచింది.న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ 31 ఏళ్లుగా(ఈ ఏడాదితో కలిపి) ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇండో అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్‌లు ఈ ఈవెంట్ నిర్వాహకులు. -
భారత్‌లో మిస్ వరల్డ్ 2023
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్–2023కు భారత్ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది. ‘71వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్ ఫైనల్లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు. #WATCH | Miss World 2022 Karolina Bielawska speaks on Miss World 2023 to be held in India. pic.twitter.com/fPxIK736MU — ANI (@ANI) June 8, 2023 -
మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’గా శ్రీ సైనీ
వాషింగ్టన్: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం భారతీయ అమెరికన్ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో శనివారం జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్ మొదటి, రెండో రన్నర్ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. -
మిస్ ఇండియా వరల్డ్‌గా మధు వల్లి
-
మిస్ ఇండియా వరల్డ్‌గా మధు వల్లి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన మధు వల్లి మిస్ ఇండియా వరల్డ్– 2017 కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా వరల్డ్ 26వ ఎడిషన్ ఆదివారం న్యూజెర్సీలో జరిగింది. 18 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో వల్లి విజేతగా నిలిచింది. రెండు, మూడో స్థానాల్లో ఫ్రాన్స్‌కి చెందిన స్టీఫెన్ మాదవానే, గయానాకి చెందిన సంగీతా బహదూర్ నిలిచారు. అలాగే మిసెస్ ఇండియా వరల్డ్‌గా టెక్సాస్‌కి చెందిన సరితా పట్నాయక్ ఎంపికైంది. హిప్హాప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న వల్లి వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో లా చదువుతోంది. మహిళా సాధికారతకి కృషి చేస్తానని వల్లి తెలిపింది. ఆర్టిస్ట్ కావడం తన డ్రీమ్ అని, భవిష్యత్‌లో హాలీవుడ్, బాలీవుడ్లల్లో పనిచేయాలని ఉందని పేర్కొంది. -
అందాల రాణి.. మోనికా గిల్
మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2014గా మిస్ ఇండియా యూఎస్ మోనికా గిల్ ఎంపికైంది. దుబాయ్‌లో వైభవంగా జరిగిన ఈ అందాల పోటీలో ఎన్నారై భామ కిరీటాన్ని అందుకుంది. రెండో స్థానంలో మిస్ ఇండియా స్విట్లర్లాండ్, మూడో స్థానంలో మిస్ ఇండియా బహ్రైన్ నిలిచారు. వివిధ దేశాల్లో ఉంటున్న భారత సంతతి యువతులలో అందగత్తెలను ఎంపిక చేసేందుకు ఈ పోటీ ప్రతియేటా నిర్వహిస్తారు. అలాగే ఈసారి 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 40 మంది యువతులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు. అబుదాబిలోని అల్ రహా బీచ్ రిసార్టులో ఫైనల్ పోటీలు జరిగాయి. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2013 విజేత నేహల్ భగోటియా ఈసారి విజేతగా నిలిచిన గిల్‌కు కిరీటం అలంకరించింది. వినికిడిలోపం ఉన్నా కూడా.. ఈ పోటీలలో గెలిచి, తొలిసారి అందాల కిరీటాన్ని అందుకున్న బధిర యువతిగా గత సంవత్సరం నేహల్ చరిత్ర సృష్టించింది. ఈసారి ఆస్ట్రేలియ, అమెరికా, ఇంగ్లండ్, కెనడా, కెన్యా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రైన్, స్వీడన్, నెదర్లాండ్స్.. ఇలా పలు దేశాల నుంచి అందగత్తెలు దుబాయ్‌లో జరిగిన ఫైనల్స్‌లో పాల్గొన్నారు. విజేతకు దాదాపు 4.81 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు పలు రకాల బహుమతులు కూడా అందజేస్తారు. -
ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా పోటీకి అనుజ్ఞ
న్యూఢిల్లీ: అబుదాబిలో ఈ నెల 20న జరగనున్న ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా అందాల పోటీకి సూరత్‌కు చెందిన అనుజ్ఞ శర్మ ఎంపికైంది. ఈ పోటీలో 40 దేశాలకు చెందిన 40 మంది విజేతలు కిరీటం కోసం పోటీపడతారు. ప్రస్తుతం పుణెలో నివసిస్తున్న డాక్టర్ అనుజ్ఞ.. శనివారం రాత్రి పుణెలోనే జరిగిన భారత విభాగం మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలో విజేతగా నిలిచింది. ముంబైకి చెందిన కృష్ణ వర్మ తొలి రన్నరప్, గోవాకు చెందిన ఆద్రే డిసిల్వా రెండో రన్నరప్‌గా నిలిచారు. 40 దేశాల్లోని భారత సంతతికి చెందిన యువతుల మధ్యన జరిగిన పోటీల్లో విజేతలు అబుదాబిలో జరిగే ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా కిరీటం కోసం పోటీపడనున్నారు. కాగా, అబుదాబిలో జరిగే పోటీలోని విజేతకు రూ. 4 లక్షల 73 వేల రూపాయలు దక్కనున్నాయి.