మిస్‌ ఇండియా వరల్డ్ వైడ్‌ విజేతగా ధ్రువీ పటేల్‌ | Who is Dhruvi Patel Miss India Worldwide 2024 All pageants Winners Details Here | Sakshi
Sakshi News home page

మిస్‌ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత ధ్రువీ పటేల్‌

Published Fri, Sep 20 2024 7:47 AM | Last Updated on Fri, Sep 20 2024 9:17 AM

Who is Dhruvi Patel Miss India Worldwide 2024 All pageants Winners Details Here

భారత్‌ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిశాయి. ‘మిస్‌ ఇండియా వరల్డ్ వైడ్‌ 2024’గా ధ్రువీ పటేల్‌ ఎన్నికైంది.న్యూ జెర్సీ ఎడిసన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆమెకు కిరీటం దక్కింది. ప్రస్తుతం ఆమె  అమెరికాలో కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ విద్యనభ్యసిస్తోంది.

మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ టైటిల్‌ కైవసం చేసుకోవడాన్ని తానొక ఉన్నత గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారామె. ఈ సందర్భంగా.. బాలీవుడ్ నటిగా, యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా రాణించాలని ఉందని ఈ సందర్భంగా తెలిపిందామె. ఈ సెగ్మెంట్‌లో.. సురినామ్‌కు చెందిన లీసా అబ్డోల్‌హక్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా, నెదర్లాండ్స్‌ మాళవిక శర్మ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

ఇక.. మిస్టర్స్‌ కేటగిరీలో ట్రినిడాడ్‌ టోబాగోకు చెందిన సువాన్‌ మౌట్టెట్‌ విజేతగా నిలవగా, యూకేకు చెందిన స్నేహ నంబీయార్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా, యూకేకు చెందిన పవన్‌దీప్‌ కౌర్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

మిస్‌ టీన్‌ వరల్డ్‌వైడ్‌ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సూరెట్‌ టైటిల్‌ దక్కించుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిశ్రేయా సింగ్‌ తొలి రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధ టెడ్‌జోయ్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది.

న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్‌ కమిటీ 31 ఏళ్లుగా(ఈ ఏడాదితో కలిపి) ఈ ఈవెంట్‌ నిర్వహిస్తోంది.  ఇండో అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్‌లు ఈ ఈవెంట్‌ నిర్వాహకులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement