అమెరికాకు చెందిన మధు వల్లి మిస్ ఇండియా వరల్డ్– 2017 కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా వరల్డ్ 26వ ఎడిషన్ ఆదివారం న్యూజెర్సీలో జరిగింది. 18 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో వల్లి విజేతగా నిలిచింది. రెండు, మూడో స్థానాల్లో ఫ్రాన్స్‌కి చెందిన స్టీఫెన్ మాదవానే, గయానాకి చెందిన సంగీతా బహదూర్ నిలిచారు. అలాగే మిసెస్ ఇండియా వరల్డ్‌గా టెక్సాస్‌కి చెందిన సరితా పట్నాయక్ ఎంపికైంది. హిప్‌హాప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న వల్లి వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో లా చదువుతోంది. మహిళా సాధికారతకి కృషి చేస్తానని వల్లి తెలిపింది. ఆర్టిస్ట్ కావడం తన డ్రీమ్ అని, భవిష్యత్‌లో హాలీవుడ్, బాలీవుడ్‌లల్లో పనిచేయాలని ఉందని పేర్కొంది.
మిస్ ఇండియా వరల్డ్‌గా మధు వల్లి
Published Wed, Oct 11 2017 6:55 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement