![ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా పోటీకి అనుజ్ఞ](/styles/webp/s3/article_images/2017/09/2/51402260408_625x300.jpg.webp?itok=EG7jUFAe)
ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా పోటీకి అనుజ్ఞ
న్యూఢిల్లీ: అబుదాబిలో ఈ నెల 20న జరగనున్న ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా అందాల పోటీకి సూరత్‌కు చెందిన అనుజ్ఞ శర్మ ఎంపికైంది. ఈ పోటీలో 40 దేశాలకు చెందిన 40 మంది విజేతలు కిరీటం కోసం పోటీపడతారు. ప్రస్తుతం పుణెలో నివసిస్తున్న డాక్టర్ అనుజ్ఞ.. శనివారం రాత్రి పుణెలోనే జరిగిన భారత విభాగం మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలో విజేతగా నిలిచింది.
ముంబైకి చెందిన కృష్ణ వర్మ తొలి రన్నరప్, గోవాకు చెందిన ఆద్రే డిసిల్వా రెండో రన్నరప్‌గా నిలిచారు. 40 దేశాల్లోని భారత సంతతికి చెందిన యువతుల మధ్యన జరిగిన పోటీల్లో విజేతలు అబుదాబిలో జరిగే ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా కిరీటం కోసం పోటీపడనున్నారు. కాగా, అబుదాబిలో జరిగే పోటీలోని విజేతకు రూ. 4 లక్షల 73 వేల రూపాయలు దక్కనున్నాయి.