ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది.
అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్‌బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్‌లైన్‌తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్‌ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది.
ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.
(చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..)
Comments
Please login to add a commentAdd a comment