భారతదేశం మిస్ వరల్డ్ 2023 అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలు భారత్‌లో నిర్వహించనుండటం విశేషం. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ నవంబర్ జరుగనుందని తెలుస్తోంది. భారత్ చివరిసారిగా 1996లో ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇన్నేళ్ల విరామం తర్వాత భారత్‌కి ఈ ప్రపంచ వేదికపై తన ఆతిధ్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించే గొప్ప అవకాశం ఇది.
ఇక ఈ అందాల పోటీల్లో భారత్ తరుఫున ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తన తోటి సోదరిమణులకు భారతదేశం అంటే ఏమిటో, ఇక్కడ ఉండే వైవిధ్య సంప్రదాయాలు, విలువలను ప్రదర్శించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని పేర్కొంది. కచ్చితంగా మన సంప్రదాయాలు, ఆతిథ్యం చూసి ముగ్ధులవుతారని నమ్మకంగా చెప్పింది. అలాగే వాళ్లకు ఇక్కడ గడపడం నచ్చుతుందని అన్నారు.
ఎవరీ సినీ శెట్టి..
కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. ఆమె మిస్ ఇండియా 2022 పోటీలో కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సినీ శెట్టి అకౌంటింగ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. ప్రస్తుతం ఆమె సీఎఫ్‌ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినీ శెట్టి తన 14 ఏటనే భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది. ఇక ప్రియాంకా చోప్రా తన రోల్ మోడల్ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment