Miss World contestant
-
ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన 71వ మిస్ వరల్డ్ అందమైన భామలు (ఫొటోలు)
-
విషాదం: బ్యూటీ క్వీన్, మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ కన్నుమూత
Ex-Miss World contestant Sherika de Armas మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె (అక్టోబర్ 13న) తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షెరికా అకాల మరణంతో సొంత దేశం ఉరుగ్వేతోపాటు, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు షెరికా. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి తనువు చాలించారు. అర్మాస్ మరణంపై స్నేహితులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఒక స్నేహితురాలిగా మీ ఆప్యాయత, మీ ఆనందం ఎప్పటికి మర్చిపోలేనివంటూ మిస్ ఉరుగ్వే 2021 లోలా డి లాస్ శాంటోస్ అర్మాస్కు నివాళులు అర్పించారు. 2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ టాప్ 30లో స్థానం దక్కించుకోలేకపోయినప్పటకి, ఆరుగురు 18 ఏళ్ల పోటీదారుల్లోఒకరిగా నిలిచింది. బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా, క్యాట్‌వాక్ మోడల్ అయినా తాను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అర్మాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ ఇష్టమనీ, అందాల పోటీలో, మిస్ యూనివర్స్‌లో పాల్గొనడం అమ్మాయిల కల అనీ పేర్కొన్నారు. కానీ అనేక సవాళ్లతో నిండిన ఈ అనుభవం తనకు దక్కడంపై సంతోషం వ్యక్తం చేసింది కూడా. షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్కోసం కొంత సమయాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ కేన్సర్ మహిళల్లో నాలుగో అత్యంత సాధారణ కేన్సర్‌గా మారిపోయింది. 2018నాటికి, ప్రపంచవ్యాప్తంగా 570,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని అంచనా. దాదాపు 311,000 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. అయితే HPV టీకా, అలాగే ముందస్తు పరీక్షలు, చికిత్స కేన్సర్‌కు నివారణ మార్గాలు అనేది గుర్తించాలి. -
భారత్‌లో మిస్ వరల్డ్ 2023
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్–2023కు భారత్ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది. ‘71వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్ ఫైనల్లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు. #WATCH | Miss World 2022 Karolina Bielawska speaks on Miss World 2023 to be held in India. pic.twitter.com/fPxIK736MU — ANI (@ANI) June 8, 2023 -
ఆ అందగత్తెది ఓ విచిత్రగాథ!
మెల్ బోర్న్: ప్రపంచ సుందరి కిరీటం ధరించాలని ఆశపడ్డ ఆస్ట్రేలియా అందం ఇజ్జి రామ్సే. ప్రపంచంలో ఎందరో సుందరీమణులున్నా.. ఆ అందగత్తెలలో ఈమెది మాత్రం ఓ విచిత్రగాథ. ఏం పని చేయాలన్నా తనకు చాలా భయమని చెప్పింది. ఆ భయం మామూలు భయం కాదు.. హైస్కూలు చదువు పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేసిందట. తనకు ఈ ఫోబియా ఎప్పటినుంచి అంటుకుందన్న వివరాలను స్థానిక మీడియాతో పంచుకుంది. ప్రతిరోజూ ఐదు దాడులకు గురవుతున్నట్లు అనిపిస్తుందని, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా తరఫున మిస్ వరల్డ్ పోటీలకు హాజరుకాబోతున్న యంగెస్ట్ ఉమెన్ ఇజ్జి. ప్రస్తుతం బ్లాక్ డాగ్ ఇనిస్టిస్ట్యూట్ సహయాంతో సిడ్నీ హార్వర్ బ్రిడ్జి దాటే హాఫ్ మారథాన్ కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. 12 ఏళ్లు ఉన్నప్పుడు 5 భయంకర సంఘటనలు జరిగాయని అప్పటినుంచీ ఈ భయాలు తనను వెంటాడుతన్నాయంది. చాలా సార్లు తాను చనిపోతానేమోనన్న స్థాయిలో భయమేస్తుందని చెప్పింది. గతేడాది జూన్ లో ఏడుగురు పోటీపడ్డ కాంపిటీషన్లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియా తరఫున మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైన విషయాన్ని వెల్లడించింది. మానసిక నిపుణులు, కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో భయాన్ని కాస్త పోగొట్టుకున్నానని, త్వరలో సాధారణ స్థితికి వస్తానని ధీమా వ్యక్తంచేసింది.