మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచిన ఓ ఆటో వాలా కూతురు మాన్యా ఓంప్రకాశ్ సింగ్. ఉత్తర ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో జన్మించిన 19 ఏళ్ల ఈ అమ్మాయి కడుపేదరికాన్ని అనుభవించింది. తిండి, నిద్రలేని ఎన్నో రాత్రులను గడిపింది. చిన్నతనంనుంచే పనిచేస్తూ చదువుకుంది. మాన్యా డిగ్రీ చదవుల కోసం వాళ్లమ్మ నగల్ని కుదువ పెట్టాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ ఆమెలో కసిని పెంచాయి. పట్టుదలతో శ్రమించి మిస్ ఇండియా 2020 రన్నరస్‌గా నిలిచింది. కొన్ని లక్షల మంది తన లాంటి కలలుకనే పేదవారికి స్ఫూర్తిగా నిలిచింది. ( ఇప్పుడేమంటారు: అశ్విన్ భార్య )
మాన్యా స్ఫూర్తిదాయక కథ చాలా మందిని ఆకర్షించింది. వారిలో భారత క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కూడా ఒకరు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా దీనిపై స్పందిస్తూ.. ‘‘ మాన్యా సింగ్.. కలలు నిజమవుతాయనడానికి నువ్వే ఓ నిదర్శనం! ఇదో స్ఫూర్తిదాయక కథ. మీ లక్ష్యాలపై నమ్మకం ఉంచండి.. వాటిని సాధించటానికి కష్టాలను అధిగమించండి’’ అని పేర్కొన్నారు. ( మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు )
Manya Singh.. what an inspirational story! You’re proof that dreams do come true. Believe in your goals and you will rise above the odds to achieve them! 👏 pic.twitter.com/jYKJGONzMf
— Shikhar Dhawan (@SDhawan25) February 14, 2021
Comments
Please login to add a commentAdd a comment