
సాక్షి, హైదరాబాదు : మహానటి సినిమాతో జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి నటించిన మిస్ ఇండియా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది. చదువు, చిన్న ఉద్యోగం, కుటుంబం, వీటన్నింటికీ భిన్నంగా ఒక మధ్యతరగతి యువతి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచనతో పెరగడం, ఇండియన్ చాయ్ బిజినెస్ ద్వారా ఉన్నతంగా ఎదిగిన తీరును ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో ఎప్పటిలాగానే కీర్తి సురేష్ నటన, బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్, నదియా, కమల్ కామరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటినుంచీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం తాజా ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో ప్రశంసలందుకుంది కీర్తి. అటు వరుస హిట్ లను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంలో మరో సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment