వరంగల్ అంటే ఇష్టం
త్వరలో మోడలింగ్ శిక్షణ సంస్థ
మిస్ ఇండియా రష్మీ ఠాకూర్
పోచమ్మమైదాన్ : వరంగల్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, ముంబై-ఢిల్లీ తరహాలో తెలంగాణలో త్వరలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తానని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని మిస్ ఇండియా రష్మి ఠాకూర్ అన్నారు. రిష్మీ ఠాకూర్ వరంగల్‌కు ఆదివారం రాత్రి ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటలల్లోనే..
వరంగల్ నాకు నచ్చిన ప్లేస్..
వరంగల్ నాకు చాలా న చ్చిన ప్లేస్. మా సొంత ఊరు కరీంనగర్. ఇప్పుడు హైదారాబాద్‌లో ఉంటున్నాను. వరంగల్ హిస్టరీని అంతా విక్లిపీడియూలో చదివాను. వరంగల్‌ను నా సొంత ఊరులా భావిస్తాను. ఖిలావరంగల్, భద్రకాళి అమ్మవారు, వేయిస్థంబాల ఆలయూలను చూశాను. త్వరలో రామప్ప, లక్నవరంను చుస్తాను.
చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్
నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తి కాగానే ఫ్యాషన్ డిజైనింగ్‌ను నేర్చుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారు. అయినప్పటి కీ వారిని ఒప్పించి అందాల పోటీల్లో పాల్గొన్నాను. హైదారాబాద్‌లో జరిగిన మిస సౌత్ ఇండియా పోటీల్లో గెలుపొందాను. తరువాత కొచ్చిన్ జరిగిన పోటీలలో పాల్గొన్నాను. అక్కడ మిస్ ఏపీ గా గెలిచాను. అలా ముందుకు సాగుతూ మిస్ ఇండియా టైటిల్‌ను సైతం గెలుచుకున్నాను.
తెలంగాణలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థ
మోడలింగ్‌ను నేర్చుకోవాలని కోరిక ఉన్న వారు అందరూ ముంబై, డిల్లీ తదితర ప్రాంతాలకు వె ళ్తున్నారు. మన తెలంగాణలో సైతం త్వరలో మోడలింగ్ పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తాను. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు వెళ్తాను. అందరు బీటెక్, మెడిసిన్ లాంటి వాటిని నేర్చుకుంటూ మోడలింగ్‌పై శ్రద్ధ పెట్టాలి.
బికినీల సంప్రదాయం మనది కాదు
అందాల పోటీల్లో చివరకు బికినీలు ధరించాలని ఉంటుంది. దీంతో మన మహిళ సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. బికినీలు ధరించడం సౌత్ ఇండియా సాంప్రదాయం కాదు కాబట్టి పోటీల్లో పాల్గొనే వారు 80శాతం వరకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే మన దేశంలో జరిగిన అందాల పోటీలలో పాల్గొని ముందుకు సాగుతున్నా. ప్రతి పేరెంట్ అందాల పోటీల్లో వద్దని చెబుతారు.
సినిమా ఆఫర్‌లు వస్తున్నాయి
మిస్ ఇండియా పర్‌ఫెక్ట్ 2014, మిస్ ఇండియా బ్యూటిఫుల్ ఐస్ 2014 అయ్యాక సినిమా ఆఫర్‌లు వస్తున్నాయి. మంచి బ్యానర్, ఒక మేసేజ్ ఓరింయటెడ్ సినిమాలో నటిస్తాను. హీరోలల్లో కమల్‌హాసన్, హిరోహియిన్‌లలో కత్రిన కైఫ్ అంటే చాలా ఇష్టం. వరంగల్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిన చిత్రం రుద్రమాదేవి చిత్రం చూడాలని బాగా ఆతృతతో ఉన్నాను. మన ప్రాంత సినిమాను మనం అందరం ఆదరించి తెలంగాణ సంస్కృతిని కాపాడుదాం. సినిమా మంచి హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. గుణశేఖర్‌కు బెస్ట్ ఆఫ్ లక్.