Rashmi Thakur
-
ప్రపంచం పిలుస్తోంది
మహిళలు అంటే వంటింటికే పరిమితం కావద్దని..తమలోని శక్తిపై నమ్మకంతో ముందడుగు వేస్తే సాధించలేనిదేమీ లేదని.. ఆడపిల్లలపై తల్లిదండ్రులు వివక్ష వీడి, అబ్బాయిలతో సమానంగా పెంచాలంటున్నారు మిస్ క్వీన్ ఇండియా, పోచంపల్లి ఇఖత్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ రశ్మీఠాకూర్. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఆడపిల్లల చదువుపై వివక్ష చూపొద్దని కోరుతున్నారు. ఎన్టీసీపీ రామగుండం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలకరించింది. స్త్రీశక్తిపై ఆమె మాటలు.. పెద్దపల్లి, జ్యోతినగర్: దక్షిణ భారతదేశంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. సమానత్వం కోసం ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మగవారితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి. అయితే ఇంటి నుంచే వివక్ష మొదలవుతుంది. తల్లిదండ్రులే ఆడపిల్లలపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో వారు స్వశక్తితో ముందుకు సాగలేకపోతున్నారు. అబ్బాయిలతో సమానంగా చూసినప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉన్నత విద్యనభ్యసించి, ఆర్థికంగా ఎదిగినప్పుడే గుర్తింపు దక్కుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. ♦ బ్రాండ్ అంబాసిడర్‌గా.. పోచంపల్లి ఇఖత్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నా అదృష్టం. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన మూడో రోజే అక్కడకు వెళ్లినప్పుడు వారి కష్టాలను చూశాను. పలువురు తమ మగ్గాలను వదిలి పెట్రోల్‌బంక్‌లు, షాపింగ్మాల్స్ల్లో వాచ్మెన్లుగా పనిచేయడం కలచివేసింది. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వారు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ‘రశ్మీఠాకూర్ టెక్స్టైల్స్’ ఏర్పాటు చేయబోతున్నాను. అంతేకాకుండా వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు వారు నేసిన వస్త్రాల గురించి ప్రచారం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాము. ♦ అందాల పోటీలపై.. పారిశ్రామికప్రాంతం రామగుండం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయితే ఇండియాలో అందాల పోటీల నిర్వహణలో వెనుకబడి ఉన్నాం. అయితే తెలంగాణ టూరిజం వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ♦ శ్రీమతి తెలంగాణతో.. స్త్రీ అంటే శక్తి అని నిరూపించేందుకే ‘శ్రీమతి తెలంగాణ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ ఈ పోటీలు చేపడుతున్నాం. ఈ పోటీల ద్వారా మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ, వారిలోని టాలెంట్‌ను బయటకు తీస్తుంది. పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణంగా ఉంది. ఈ పోటీల ద్వారా మహిళల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహిళల్లోని ప్రతిభను వెలుగుతీసేందుకే ఈ కార్యక్రమం. ♦ యువతకు సందేశం విద్యతోనే బంగారు భవిష్యత్ సాధ్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలం. సోషల్‌మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. అలాగని గంటలకొద్దీ గడపడం కచ్చితంగా తప్పు. ఆరోగ్యం పాడుకావడంతోపాటు విలువైన సమయాన్ని నష్టపోతాం. మనకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. విశ్రమించకుండా పరిశ్రమించాల్సిందే. అప్పుడే బంగారు భవిష్యత్ మన కళ్ల ముందు ఉంటుంది. మనకంటూ గుర్తింపు వస్తుంది. తల్లిదండ్రులు సైతం ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు. మగవారితో సమానంగా పెంచాలి. -
వరంగల్ అంటే ఇష్టం
త్వరలో మోడలింగ్ శిక్షణ సంస్థ మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ పోచమ్మమైదాన్ : వరంగల్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, ముంబై-ఢిల్లీ తరహాలో తెలంగాణలో త్వరలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తానని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని మిస్ ఇండియా రష్మి ఠాకూర్ అన్నారు. రిష్మీ ఠాకూర్ వరంగల్‌కు ఆదివారం రాత్రి ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటలల్లోనే.. వరంగల్ నాకు నచ్చిన ప్లేస్.. వరంగల్ నాకు చాలా న చ్చిన ప్లేస్. మా సొంత ఊరు కరీంనగర్. ఇప్పుడు హైదారాబాద్‌లో ఉంటున్నాను. వరంగల్ హిస్టరీని అంతా విక్లిపీడియూలో చదివాను. వరంగల్‌ను నా సొంత ఊరులా భావిస్తాను. ఖిలావరంగల్, భద్రకాళి అమ్మవారు, వేయిస్థంబాల ఆలయూలను చూశాను. త్వరలో రామప్ప, లక్నవరంను చుస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తి కాగానే ఫ్యాషన్ డిజైనింగ్‌ను నేర్చుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారు. అయినప్పటి కీ వారిని ఒప్పించి అందాల పోటీల్లో పాల్గొన్నాను. హైదారాబాద్‌లో జరిగిన మిస సౌత్ ఇండియా పోటీల్లో గెలుపొందాను. తరువాత కొచ్చిన్ జరిగిన పోటీలలో పాల్గొన్నాను. అక్కడ మిస్ ఏపీ గా గెలిచాను. అలా ముందుకు సాగుతూ మిస్ ఇండియా టైటిల్‌ను సైతం గెలుచుకున్నాను. తెలంగాణలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థ మోడలింగ్‌ను నేర్చుకోవాలని కోరిక ఉన్న వారు అందరూ ముంబై, డిల్లీ తదితర ప్రాంతాలకు వె ళ్తున్నారు. మన తెలంగాణలో సైతం త్వరలో మోడలింగ్ పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తాను. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు వెళ్తాను. అందరు బీటెక్, మెడిసిన్ లాంటి వాటిని నేర్చుకుంటూ మోడలింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. బికినీల సంప్రదాయం మనది కాదు అందాల పోటీల్లో చివరకు బికినీలు ధరించాలని ఉంటుంది. దీంతో మన మహిళ సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. బికినీలు ధరించడం సౌత్ ఇండియా సాంప్రదాయం కాదు కాబట్టి పోటీల్లో పాల్గొనే వారు 80శాతం వరకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే మన దేశంలో జరిగిన అందాల పోటీలలో పాల్గొని ముందుకు సాగుతున్నా. ప్రతి పేరెంట్ అందాల పోటీల్లో వద్దని చెబుతారు. సినిమా ఆఫర్లు వస్తున్నాయి మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014, మిస్ ఇండియా బ్యూటిఫుల్ ఐస్ 2014 అయ్యాక సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి బ్యానర్, ఒక మేసేజ్ ఓరింయటెడ్ సినిమాలో నటిస్తాను. హీరోలల్లో కమల్‌హాసన్, హిరోహియిన్లలో కత్రిన కైఫ్ అంటే చాలా ఇష్టం. వరంగల్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిన చిత్రం రుద్రమాదేవి చిత్రం చూడాలని బాగా ఆతృతతో ఉన్నాను. మన ప్రాంత సినిమాను మనం అందరం ఆదరించి తెలంగాణ సంస్కృతిని కాపాడుదాం. సినిమా మంచి హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. గుణశేఖర్‌కు బెస్ట్ ఆఫ్ లక్.