నంద్యాలలో రేష్మి సందడి
నంద్యాల: హీరోయిన్, ప్రముఖ యాంకర్ రేష్మి స్టెప్పులతో, పాటలతో అదరగొట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి యువకులు ఎగబడ్డారు. జేవీసీ మోటార్స్ సంస్థ హీరోహోండా స్కీం లక్కీడిప్ తీసేందుకు ఆమె ఆదివారం నంద్యాలకు వచ్చారు. సంస్థ అధినేత మనోహర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన నూనెపల్లెకు చెందిన వీరారెడ్డికి రూ.60వేల విలువ గల బైక్‌ను, రెండవ, మూడో బహుమతులను, 20 కన్సోలేషన్ ప్రైజ్ లను విజేతలకు అందజేశారు. అనంతరం రేష్మి మాట్లాడుతూ.. నంద్యాల ప్రజలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని, మనోహర్ ద్వారానే అవకాశం వచ్చిందన్నారు. టీవీ యాంకరింగ్ కార్యక్రమాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వస్తున్నాయని చెప్పారు. అనంతరం ఆమె డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. యువకులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడటంతో ఎస్‌ఐలు రమణ, మోహన్‌రెడ్డి, సిబ్బంది యువకులను అదుపు చేసి, ఆమెను క్షేమంగా పంపారు. స్థానిక గాయకుడు ప్రభాకర్ సంగీత విభావరి అందరిని ఆకట్టుకుంది.