
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా.. గత ఎన్నికల్లో తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభిమాన హీరో నంద్యాలకు రావడంతో ఊహించని రీతిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ నియామావళి ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment