ఆ సమయంలో సీరియస్‌గా ఉంటా: రష్మి | Acting With Yogi Babu Is So Hard Says Rashmi Gopinath | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో సీరియస్‌గా ఉంటా: రష్మి

Published Mon, Mar 16 2020 7:48 AM | Last Updated on Mon, Mar 16 2020 7:48 AM

Acting With Yogi Babu Is So Hard Says Rashmi Gopinath - Sakshi

రష్మీ గోపినాథ్‌

శాండిల్‌వుడ్‌ నుంచి మరో నటి కోలీవుడ్‌కి దిగుమతి అయ్యింది. ఈ అమ్మడి పేరు రష్మీగోపీనాథ్‌. విశేషం ఏమిటంటే ఏకకాలంలో కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటించేస్తోంది. ఎంబీఏ చదివి మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించిన రష్మీగోపీనాథ్‌  అక్కడ 2016లో ఉత్తమ మోడల్‌గా గుర్తింపు పొందింది. ఆ తరువాత సినీ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఇప్పుడు కోలీవుడ్‌లో కాక్‌టెయిల్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. నటుడు యోగిబాబు హీరోగా నటిస్తున్న చిత్రం కాక్‌టెయిల్‌. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి రష్మీ గోపినాథ్‌ చెబుతూ నటుడు యోగిబాబును టీవీలో చూశాను, సినిమాలో చేశానని అంది. అయితే ఆయనతో కలిసి కాక్‌టెయిల్‌ చిత్రంలో మొదటి రోజునే నటిస్తానని ఊహించలేదని అంది.

అయితే తన టెన్షన్‌ను ఆయన మొదటి రోజునే పోగొట్టారని చెప్పింది. ఈ చిత్రంలో తనది గ్రామీణ యువతి పాత్ర అని చెప్పింది. షూటింగ్‌లో తనను ఎవరైనా ఆట పట్టించాలనుకుంటే మాత్రం ఊరుకోనంది. వారి పనిపడతానని చెప్పింది. అంతగా దూకుడు అమ్మాయిని తానని చెప్పింది. కాక్‌టెయిల్‌ చిత్ర షూటింగ్‌లో ఒక సన్నివేశంలో యోగిబాబును తిడుతూ చాలా పెద్ద డైలాగ్‌ చెప్పాలని, అలా తడబడకుండా చెబుతుంటే మధ్యలో ఆయన కౌంటర్‌ వేశారంది. అంతే తాను జామ్‌ అయిపోయానని చెప్పింది. ఆయన కౌంటర్‌కు నవ్వు ఆపుకోవడం సాధ్యం కాలేదని చెప్పింది. యోగిబాబు నటిస్తున్నప్పటి కంటే బయట ఇంకా నవ్విస్తారని చెప్పింది. అదే మూడ్‌లో నటించడానికి రెడీ అయితే సరిగా నటించలేకపోయోదాన్ని అని చెప్పింది. అందుకే యోగిబాబుతో నటించేటప్పుడు అంతకుముందు జరిగిన సీరియస్‌ సంఘటనను తలచుకుని నటించేదాన్ని అని చెప్పింది.

కాగా కాక్‌టెయిల్‌ చిత్రంతో పాటు కన్నడంలో పాత్రా అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. అదేవిధంగా తెలుగులో డబ్బే డబ్బు అనే చిత్రంలో నటించినట్లు చెప్పింది. కాగా ప్రస్తుతం తమిళంలో సీవీ.కుమార్‌ నిర్మిస్తున్న వైరస్‌ అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నట్లు చెప్పింది. ఇందులో తన పాత్ర కాక్‌టెయిల్‌ చిత్రంలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. వైరస్‌ చిత్రంలో ఐఏఎస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలిపింది. అయితే కథానాయకి పాత్రలనే కాకుండా నటిగా తన సత్తాచాటుకునే విధంగా  వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు రష్మి గోపీనాథ్‌ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement