నాగప్రభాకర్, పద్మనాభరెడ్డి
ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? అనే సస్పెన్స్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నాగప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. యూ అండ్ ఐ ఎంటరై్టన్‌మెంట్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగు’ సినిమా తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్‌తో పాటు థ్రిల్లర్ అంశాలున్నాయి.
ప్రేక్షకులు థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. శివరంజని ఎవరు? అనేది తెలుసుకోవడమే సినిమా. ధన్‌రాజ్ కామెడీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కె. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘వాలి’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ముందు క్లయిమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథ రెడీ చేశా. అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నాగప్రభాకర్. నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్‌రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటించిన ఈ సినిమాకి కెమెరా: సురేందర్ రెడ్డి, సమర్పణ: నల్లా స్వామి, సహ నిర్మాత: కటకం వాసు.
Comments
Please login to add a commentAdd a comment