రిలీజ్‌కు రెడీ అయిన ‘అనాధ’ | Anadha Movie Release Date Out | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు రెడీ అయిన ‘అనాధ’

Published Fri, Nov 15 2024 6:05 PM | Last Updated on Fri, Nov 15 2024 6:05 PM

Anadha Movie Release Date Out

శ్రీ ఇంద్ర ,నికిత స్వామి, యుక్త పెర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్  ‘అనాధ’.  అన్నాసేట్ కె. ఏ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోనేంద్ర ఫిలిమ్స్ పతాకంపై శ్రీ ఇంద్ర నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ.. ‘ఇది ఒక మంచి కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ త్రిల్లర్. ఈ చిత్రంలో యూత్ కికావలసిన అన్ని అంశాలు ఉంటాయి. పర్టిక్యులర్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక యూత్ కే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానునాం. ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement