Indra
-
రిలీజ్‌కు రెడీ అయిన ‘అనాధ’
శ్రీ ఇంద్ర ,నికిత స్వామి, యుక్త పెర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘అనాధ’. అన్నాసేట్ కె. ఏ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోనేంద్ర ఫిలిమ్స్ పతాకంపై శ్రీ ఇంద్ర నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ.. ‘ఇది ఒక మంచి కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ త్రిల్లర్. ఈ చిత్రంలో యూత్ కికావలసిన అన్ని అంశాలు ఉంటాయి. పర్టిక్యులర్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక యూత్ కే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానునాం. ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు. -
ఇంద్ర మూవీ రీ రిలీజ్.. చిత్రబృందానికి మెగాస్టార్ స్పెషల్ ట్రీట్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈనెల 22న ఆయన బర్త్ డేను తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు మరింత స్పెషల్‌గా మారింది. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర మూవీ టీంను ఘనంగా సత్కరించారు. ఇంద్ర క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేసుకుంటూ నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథ అందించిన చిన్ని క్రిష్ణను ఆయన సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి తన ట్విటర్లో పోస్ట్ చేశారు.అదిరిపోయే కలెక్షన్స్దాదాపు 22 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర. మొదటి రోజు అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3.05 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇంద్ర' క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, 'ఇంద్ర' టీంకి 'చిరు' సత్కారం! అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
ఇంద్ర మళ్లీ వస్తున్నాడు
చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఇంద్ర’ (2002). ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి అలియాస్ శంకర్ నారాయణ పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా రీ–రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది. -
అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు రన్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే
-
పెళ్లిచూపుల రోజే మృత్యు ఒడిలోకి..
మహబూబ్‌నగర్: తెల్లారితే పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా.. గ్రానైట్ బండలు మీదపడి మండలానికి చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన తెలుగు వాకిటి దొడ్డెన్న కుమారుడు తెలుగు వాకిటి ఇంద్ర (21) మండల కేంద్రంలోని రైస్ మిల్లులో ఆపరేటర్‌గా పని చేస్తుండేవాడు. ఆదివారం రాత్రి ఇంటి నిర్మాణం కోసం తెచ్చుకున్న గ్రానైట్ బండల లోడు డీసీఎంలో మండల కేంద్రానికి చేరుకుంది. రైస్ మిల్లు దగ్గర డీసీఎం నుంచి బండలను కిందకు దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండలు యువకుడిపై పడడంతో తలకు వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆయనను గద్వాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. సోమ వారం రోజు మృతుడికి పెళ్లి చూపులకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా తెల్లారక ముందే మృత్యు రూపంలో బండలు కబళించి వేయడంతో ఆ కుటు ంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలు సుకున్న గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. -
17 కథలు రెడీగా ఉన్నాయి
‘‘నాలుగేళ్ల క్రితం ‘వై మేల్ ఈజ్ ఏ జోక్’ అనే వీడియో రూపొందించాను. సౌతిండియాలో వైరల్ అయిన తొలి వీడియో అది. ఆ వీడియోకి వచ్చిన ఒక కామెంట్ నాలో ఆసక్తి కలిగించింది. దాంతో రామాయణం మొత్తం చదివాను. సుమారు 8 వెర్షన్లు చదివాను. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రాముడు, సీత లాంటి పాత్రలుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే ‘రామ చక్కని సీత’ చిత్రాన్ని తీశాను’’ అని దర్శకుడు శ్రీహర్ష మండ అన్నారు. ఇంద్ర, సుకృత జంటగా శ్రీహర్ష తెరకెక్కించిన చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీహర్ష, ఫణి నిర్మించారు. గత శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ – ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాణ్ణి. ‘నువ్వు ఇందులో బాగా రాణిస్తావు రా’ అని టీచర్లు మెచ్చుకునేవారు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. వీవీ వినాయ్గారు తీసిన ‘నాయక్’ సినిమాకు నేను చివరి అప్రెంటిస్‌ని. నేను ఆ సినిమాకి పని చేశా అని బహుశా వినాయక్‌గారికి కూడా తెలిసుండదు. ఆ తర్వాత దశరథ్గారి దగ్గర ‘శౌర్య’, ఓంకార్‌గారి దగ్గర ‘రాజుగారి గది 2’ సినిమా, ‘సిక్త్స్ సెన్స్’ అనే షోకు వర్క్ చేశాను. ఈ సినిమాను నా స్నేహితుడు ఫణితో కలసి నిర్మించాను. ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు, రివ్యూలు చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయని చెప్పడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర 17కథలు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా చేస్తాననేది త్వరలో చెబుతాను’’ అన్నారు. -
రామచక్కని సీత టైటిల్ బాగుంది
‘‘రామచక్కని సీత’ మంచి టైటిల్.. చాలా బాగుంది. ఈ సినిమా హీరో ఇంద్ర చాలా మంచి అబ్బాయి. తనంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మంచి విజయం సాధించి, హీరో, హీరోయిన్‌కి, యూనిట్‌కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. ఇంద్ర, సుక్రుతా వేగల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రామచక్కని సీత’. శ్రీహర్ష మండాని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాలాక్షి మండా, జి.ఎల్. ఫణికాంత్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బి.గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మండా మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ప్రోత్సహించిన దాసరి కిరణ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫణికాంత్ నా స్నేహితుడు. నా కోసం ఈ సినిమా తీశాడు. మా చిత్రం ద్వారా ఇంద్ర, సుక్రుతా వేగల్ పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని ఇంత దూరం తీసుకువచ్చాం’’ అన్నారు ఫణీంద్ర. ‘‘మా సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశాలాక్షి. ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకి కృతజ్ఞతలు’’ అన్నారు ఇంద్ర. ‘‘కన్నడలో నేను 7 చిత్రాల్లో నటించా. తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. కన్నడ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా’’ అని సుక్రుతా వేగల్ అన్నారు. రచయిత విస్సు, నిర్మాత మల్టీ డైమన్షన్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
వాలి స్ఫూర్తితో...
ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? అనే సస్పెన్స్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నాగప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగు’ సినిమా తర్వాత మా బ్యానర్లో వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్‌తో పాటు థ్రిల్లర్ అంశాలున్నాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. శివరంజని ఎవరు? అనేది తెలుసుకోవడమే సినిమా. ధన్‌రాజ్ కామెడీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కె. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘వాలి’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ముందు క్లయిమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథ రెడీ చేశా. అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నాగప్రభాకర్. నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్‌రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటించిన ఈ సినిమాకి కెమెరా: సురేందర్ రెడ్డి, సమర్పణ: నల్లా స్వామి, సహ నిర్మాత: కటకం వాసు. -
చక్రపాణి ఇంద్రలోక యాత్ర
దేవేంద్రుని మందిరం.ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటు ఇటూ పచార్లు చేస్తుంటాడు.రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని ఆనుకుని నిలబడి ఉంటుంది.‘‘అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధితక్కువ...నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను...ఎక్కడ దేవేంద్రలోకం! ఎక్కడ నీచ మానవలోకం! ఛీఛీ...చెప్పడానికైనా నీకు సిగ్గు లేదా రంభా! నీవేనా ఈవిధంగా మారావు! ఎంత అవివేకం! ఎంత అవమానం!’’‘‘ఇందులో అవమానం ఏమున్నది ప్రభూ! మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు...నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది. సరస్వతిదేవి అక్కడే స్థిరనివాస మేర్పరచుకున్నది. మానవలోకంలోని సుఖఃదుఃఖాలు మనకు లేవనిపిస్తోంది...అన్నీ ఉంటేనే జీవితం అనీ, మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడి ఉంటామనీ, మన జీవితాలు ఎందుకూ పనికిరావనీ చక్రపాణిగారు చెప్తుండేవారు’’‘‘బుద్ధిహీనురాలా! అతడి పేరు నా దగ్గిర ఎత్తకు. నా విరోధిని మెచ్చుకుని నన్ను అవమానిస్తావా?’’ ‘‘ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభూ!...మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగతీసి మీ పాదాల ముందు పడవేయలేదు! ఎంతమందిని తపోభ్రష్టులను చేయలేదు. కాని చక్రపాణిగారి విషయం అలా కాలేదు’’‘‘అంటే చక్రపాణి మానవాతీతుండటావా!’’‘‘అనుకోవాల్సిందే! ఆయన మనిషి కాడు...అయితే నా ఓటమికి అర్థం లేదుకదా ప్రభూ!’’‘‘మూర్ఖురాలా– ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా!’’ ‘‘అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభూ...చక్రపాణిగారి మంచితనం చూసి నా అంతట నేనే ఆయన దగ్గిర ఉండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను. నిజంగా నాది ఓ జీవితమేనా అనిపించింది. నా మీద నాకు రోత పుట్టింది. ఎప్పుడూ మీ దర్బారులో నాట్యం చేయడం తప్ప నా జీవితానికి ఏ విధమైన అర్థం లేకుండా పోయింది...అక్కడ అనేక విధాలయిన పాత్ర పోషణలో నవరసాలు నటనలూ చిందించే కళాజీవుల్ని గురించి విని నా మనసు ఉప్పొంగిపోయింది. చక్రపాణిగారిని వేషమిప్పించమని నేనే అడిగాను. అందులోనూ మంచి బరువువైన పతివ్రత పాత్ర ఇచ్చారు...నా కోసం రాయించారు పాపం... నేను ఎంత పాపిని! చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను. ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో!’’‘‘ఛీ! జ్ఞానహీనురాలా! ఇంకా నీ వా భూలోకం మరచి పోలేకపోతున్నావా! పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా! నీవల్ల నారదాదుల దగ్గిర నాకెంత అవమానం. ఆ నారదుడు ఊరుకోడే! ముల్లోకాలలోనూ నా ఈ అపజయాన్ని చాటుతాడే! నీ వా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్యవిధులు నిర్వర్తించు...’’‘‘నావల్ల కాదు ప్రభూ! ఇక నేనే మీ దర్బారులో ఆడలేను. నేను భూలోకానికి పోతాను. నా కక్కడ కొత్తజీవితం కనిపించింది. నన్ను క్షమించండి. నన్ను వెళ్లనివ్వండి...’’ రంభ కదుల్తుందిముందుకు...ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి ‘‘రంభా’’ అంటూ పెద్ద రంకె వేస్తాడు.రంభ నిశ్చలంగా నిలబడి, ‘‘మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభూ! నా నిశ్చయం మారదు. నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి. నన్నాకపండి’’ రెండడుగులు వేస్తుంది.ఇంద్రుడు మళ్లీ అడ్డునిలిచి కోపంతోనూ, అవమానంతోనూ కంపించిపొతూ, ‘‘నీ నిశ్చయం మారదా, నీ పట్టు విడవ్వా?’’‘‘విడవలేను. నా ఆశయం నెరవేరాలి. నేను ఒక గొప్ప నటిననిపించుకుని–అటు భూలోకానికి, ఇటు ఇంద్రలోకానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలి. రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి. అలాంటి పాత్రఇచ్చారు ‘‘ఛీ,దౌర్భాగ్యురాలా! ఆ సన్యాసి పేరెత్తుకు నా దగ్గిర’’‘‘నారాయణ’’ అంటూ నారదుడు ప్రవేశిస్తాడు.‘‘ఏమిటి ఇంద్రా, రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు. ఏమైంది రంభ?’’ఇంద్రుడు కాస్త చల్లబడి, ‘‘చూడు నారదా! భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి నే వెళతాను భూలోకానికి అంటుంది’’‘‘నారాయణ...అందాకా వచ్చిందీ కథ. నేనప్పుడే చెప్పాను గదయ్యా! ఆ మానవులు అసాధ్యులు. అందులోనూ ఆ సినిమాజీవులు అఖండులని...అయితే ఇంతకూ రంభ మళ్లీ ఎందుకు వెళతానంటూందీ!’’‘‘ఎందుకా! నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట...’’‘‘నిజమే. మరి పాపం సగంలో మనిద్దరం వెళ్లి రంభను తీసుకొచ్చామాయే–అయినా మళ్లీ వెళ్లి లాభం ఏమిటి! రంభకు బదులు ఎవరిచేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్టున్నాడే’’‘‘ఆ! నిజంగానా! హతవిధి...నే నెంతగా ఆశపడ్డానే! ఎంతో కష్టపడి నటించానే...మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈవిధంగా అయిందే! ఇక నేను జీవించి ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ రంభ వెక్కివెక్కి ఏడుస్తుంది.ఇంద్రుడు ఖంగారు పడిపోతూ ‘‘నారదా! ఇప్పుడేది దారి! రంభకు పిచ్చి ఎలా వదుల్తుంది?’’‘‘నీవు పిక్చరు తీస్తే వదుల్తుంది...’’ ‘‘పిక్చరా! అంటే?’’‘‘అంటే ఏముంది ఇంద్రా...ఆ మానవులు చలనచిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నవ్వూ ఒక చిత్రశాల కట్టించు...’’‘‘చిత్రశాల నేను కట్టించడమా! ఏమిటి నారదా మీరనేది! అది మనకెలా సాధ్యం!’’‘‘ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి...’’‘‘నేనంటే కిట్టనివాడిని రంభ కోసం ‘అన్యధా శరణం నాస్తి’ అంటూ అర్థించమంటావా!’’‘‘ఏంచేస్తాం ఇంద్రా! మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు’’ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి, ‘‘అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా?’’‘‘ఏంలేదు...తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి...రంభ కోసం నీవే ఇక్కడ చలనచిత్రాలు తీయవచ్చు. అందుకు కావలసిన పరికరాలూ, ఇతర వివరాలూ చక్రపాణి చెప్తాడు. అతడు ఎలా చెప్తే అలా చేయి...ఏం రంభా!’’‘‘అవును స్వామీ...మీరు చెప్పింది చాలా బాగున్నది. చక్రపాణిగారు మన ఇంద్రలోకానికి రావాలేగాని, వస్తే వారు మన కన్ని వివరాలు చెప్తారు’’ అంటూ సంతోషంగా చెప్తుంది రంభ.కోపం దిగమింగుకుని కొరకొర చూస్తాడు ఇంద్రుడు‘‘నారాయణ!...ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్రా!’’‘‘సరే ప్రారబ్దం మహామహులకే తప్పలేదు. ఇంతకూ ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం! అతడు ఒట్టి మొండివాడే! పిలిస్తే రాడే!’’‘‘నిజమే! పిలిస్తే వచ్చేమనిషికాడు–నిద్రపోతూండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావలసిందే. నేను వెళ్లొస్తాను...నారాయణ’’భూలోకంచక్రపాణిగారి గది...చక్రపాణిగారు నిద్రపోతుంటారు. నిద్దట్లో కలవరిస్తాడు...‘‘ఏంకదది! ఆడి కద ఈడు కాపీ గొట్టాడు...అసలు కద ఛండాలం...గుండమ్మకద బాగ లేదన్నాడు గదాడు!...’’ అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు...మంచం కదుల్తుంది...మరుక్షణం అదృశ్యమౌతుంది.ఇంద్రలోకం చక్రపాణిగారికి మెలకువ వస్తూనే కండ్లుకూడా తెరవకుండా మంచం పక్క టీపాయి ఉందనుకుని సిగరెట్ డబ్బా కోసం చెయ్యి చాస్తడు. పండ్లూ ఫలహారాలు చేతికి తగుల్తాయి...గొణుక్కుంటూ లేచికూర్చుంటాడు...ఎదురుగా ఒక పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు...అంత వెలుగు చూడలేక ఒక చేయి కండ్ల కడ్డుంచుకుని విసుగ్గా...‘‘ఎవర్నువ్వు!’’ అంటాడు.‘‘నేను ఇంద్రుడిని’’‘‘అట్టనా! అద్సరేగానీనాసిగరెట్ డబ్బా చూశావా!’’ఇంద్రుడు వెలవెలబోతాడు.మరుక్షణం రత్నాలపెట్టెలో బంగారుచుట్టలు తెచ్చి చక్రపాణిగారికి అందించబోతాడు సేవకుడు.‘‘అబ్బే! ఇందేంటి ఛండాలం! నాకు స్టేటెక్స్ప్రెస్ కావాల...’ఇంద్రుడు ‘‘చిత్తం’’ అంటూ అర్థం కాక సేవకుడి వైపు చూస్తాడు...సేవకుడు అదృశ్యమౌతాడు...‘‘అద్సరే. నే నెక్కడున్నా నిప్పుడూ?’’‘‘చిత్తం. ఇంద్రలోకంలో...’’‘‘అట్టనా!...అయినా నన్నెందుకు తెచ్చావ్ ఇక్కడికి. అస్సలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా?’’ఇంద్రుడు చిన్నబుచ్చుకొని, ‘‘వేషం కాదు... నేనుదేవేంద్రుణ్ణి...’’‘‘పైన ఆ ‘దేవ’ ఎందుకులే...ఒట్టి ఇంద్రుడంటే చాల్దూ!...అస్సరేగానీ నా సిగరెట్ డబ్బా ఏదీ!’’‘‘చిత్తం. ఇదుగో’’ అంటూ సేవకుడు చక్రపాణిగారికి సిగరెట్ డబ్బా అందిస్తాడు.‘‘అగ్గిపెట్టేదీ?’’‘‘తమరు ధూమపానం చేయండి. నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది’’ అంటాడు ఇంద్రుడు.‘‘దీనికి నీ బోడిశక్తెందుకూ?’’ అగ్గిపుల్లతో పోయేదానికి!అగ్గిపుల్లెలిగించకపోతే సిగరెట్ తాగినట్టుండదు...అగ్గిపెట్టొకటి తెప్పిచ్చు...చిత్తం...మరుక్షణం అగ్గిపెట్టె చక్రపాణిగారి చేతి కందిస్తాడు సేవకుడు. చక్రపాణిగారు సిగరెట్ వెలిగిస్తూ, ‘‘అవునుగానీ, నా క్కాఫీ కావాల్నే! దొరుకుద్దా!’’‘‘చిత్తం...తెప్పిస్తాను’’ అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు.‘‘అద్సరేగానీ, బాత్రూమెక్కడా. అసలుందా బాత్రూము!’’‘‘చిత్తం’’ ఇంద్రుడు తిరిగి చూస్తాడు. ఇద్దరు సేవకులు వస్తారు.చక్రపాణిగారు మంచం దిగి కాళ్లు కిందపెడతాడు. ‘‘అరెరె? నా చెప్పులేయి! ఇదేంటి కాళ్లకింద ఇంత మెత్తగుంది!’’‘‘అది పూలరెక్కల రత్నకంబళం’’‘‘కాళ్లకింద పూల్రెక్కల కార్పేట్టేంటి ఛండాలం...గొర్రెబొచ్చుది దొరకదు మీకూ’’ఇంద్రుడు చక్రపాణిగారి వేపు అయోమయంగా చూస్తాడు.‘‘అన్నట్లు రంభేదీ! బాగుందా!’’ అని చక్రపాణిగారు అడుగుతుండగానే రంభ ఒక స్తంభం చాటు నుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రపాణిగారి పాదాల మీద పడుతుంది. ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు. చక్రపాణిగారు కాస్త ఇబ్బందిపడుతూ, కాళ్లు వెనక్కి లాక్కుని ‘‘ఇదేంటి సినిమాలో సీనులాగా...లేలే...బాగున్నావా...పతివ్రతేషం కావాలని కోరికోరి ఏసిందానివిసగంలోనే రంభ లేచి నిలబడి ‘‘అందుకే క్షమించమంటున్నాను. నా తప్పులేదు చక్కన్నగారూ. తప్పంతా వారిది’’ అంటూ ఇంద్రుణ్ణి చూపిస్తుంది. ఇంద్రుడు కోపాన్ని దిగమింగి తలవంచుకుంటాడు.‘‘సరేలే, దానికి నువ్వేడవడం ఎందుకూ...ఎనకటికి ఎవతో మొగుణ్ణి గొట్టి ఏడ్చిందట...పిచ్చెరు సగంలో నువ్వొచ్చినందుకు ప్రొడ్యూసరేడవాలిగాని నువ్వేడుస్తావేం! బాతురూమ్ కెళ్తొస్తా’’ అంటూ సేవకుల వెంటనడుస్తాడు.పారిజాతవనంఇంద్రుడు, రంభ, చక్రపాణిగారూ ఆసీనులై ఉంటారు. సేవకుడు నవరత్నాలు పొదిగిన పాన పాత్రల్లో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందుంచుతాడు. ఇంద్రుడు ఒక అమృతపాత్ర అందివ్వబోతాడు. అది చూస్తూనే ‘‘ఇదేమిటి ఛండాలం...ఇదెవుడు తాగుతాడు. నాకిదొద్దు. స్కాచ్‌విస్కీ ఉంటే తెప్పిచ్చు’’ అని నసుగుతాడు చక్రపాణిగారు.ఇంద్రుడు వెలవెలబోతాడు.‘‘అవును ప్రభూ! చక్కన్నగారికి అమృతం అంటేనే అసహ్యం’’ అంటుంది రంభ. ఇంద్రుడు రంభను మింగేట్లుచూస్తాడు. మరుక్షణం ‘స్కాచ్‌విస్కీ బాటిల్’ గ్లాసుతో సహా చక్రపాణిగారి పక్కనున్న టేబిల్ మీదకనిపిస్తుంది. ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ మరొక చేత్తో విస్కీగ్లాస్ తీసుకుంటాడు. ఇంద్రుడు అమృతం సేవిస్తూ, రంభను కూడా తీసుకోమంటాడు. చక్రపాణిగారు కొప్పడతారు ఒద్దని సౌంజ్ఞతో చెప్తుంది రంభ...ఇంద్రుడి కండ్లునిప్పుకణాల్లా ఎర్రబడతాయి.‘‘ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు?’‘‘మీతో ఒక గొప్ప పనివుండే తీసుకొచ్చాం చక్కన్నగారూ!’’ అంటుంది రంభ. ‘‘నాతో మీకేం పని! అన్నట్లుగా నాకవతల షూటింగుందే. పదిగంటలకే నే నక్కడుండాల్నే...’’రంభ కంగారు పడిపోతూ ‘‘చక్కన్నగారూ! త్వరగా వెళ్లడానికి వీల్లేదు. మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి. ఏది కావాలన్నా...క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది’’‘‘క్షణంలో మీరేం జేసినా, కథనీ, టెక్నిషియన్లనీ క్షణంలో తయారుజేయలేరే.... మాయం చెయ్యడం, మాయం గావడంలా తేలికపన్లు గావియ్యన్నీ... అయినా మీ కెందుకుకా స్టూడియోల పిక్చెర్లూ...పన్లేనిపనిగాకపోతే’’ఇంద్రుడు తలపట్టుకొని ఒక్క నిట్టూర్పు విడుస్తాడు.రంభ అనునయంగా కాస్త చక్రపాణిగారి దగ్గరకు జరిగి–‘‘నా కోసమే చక్కన్నగారూ! భూలోకం నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నటించాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది. మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో ఉత్సాహంతో నటించాను...ఎన్ని కలలుకన్నాను. కాని ఆ చిత్రం పూర్తి చేసే భాగ్యం లేకుండా పోయింది’’‘‘దానికింత గొడవెందుకూ! మళ్లీ నువ్వే అక్కడి పో! అక్కడే ఏదో ఒకేషం ఏస్తే పోయేదానికి. నీ ఒక్కదాని కోసం ఇంతదూరంలోవేరేస్టూడియో ఎందుకూ...’’ఫర్వలేదు చక్కన్నగారూ! నా కోసం దేవేంద్రులు ఏంకావాలన్నా సమకూరుస్తారు...ఒక్క స్టూడియో ఏమిటి...’’‘అద్సరేలే...ఇంద్రుడు నీ చేతిలో ఉన్నాడని నువ్వు స్టూడియోలు కట్టించొచ్చు. కాని ఇక్కడికొచ్చి పిక్చెరు తీసేవాడుండొద్దూ! పైగా ఇక్కడ ఏంగావాలన్నా అక్కణ్ణించి రావాలాయె...ఎందుకొచ్చింది...ఏదోవషం ఇప్పిస్తా’’రంభ సంతోషపడిపోతూ ‘‘మీరెలా చెప్తేఅలాచేస్తాను చక్కన్నగారూ’’ అంటుంది.ఇంద్రుడు గాభరపడిపోతూ...‘‘అదికాదు చక్రపాణిగారూ! రంభ లేకపోతే ఇంద్రలోకంలో ఏముంటుంది’’‘‘లేకపోతే పోద్దీ...కళ కోసం నీ పరువు పోగొట్టుకుంటావానీలాంటోళ్లు పిక్చెర్లనీ, స్టూడియోలని మొదలెలెడితే అది కాస్తా కంపౌద్ది...గవర్నమెంటోళ్లు సినిమాలు తీయించినట్టుంది’’ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభ వైపు ‘నాకక్కడషూటింగుందే! వాళ్లంతా ఏం కంగారు పడుతున్నారో! ఇదంతా ఒక్కరోజులో జరిగేది కాదే! అయినా ఇప్పుడుడెంటనే పిక్చెరు తీయడానికి ఇక్కడ మీకేం ఉంది? ఎట్ట దీస్తారంట!’’రంభ, ఇంద్రుడు ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటారు అర్థం గాక.‘అంటే చిత్రశాల లేదని అంటున్నారా?’’ అని అడుగుతుంది రంభ....‘‘మీరే చెప్పండి చక్కన్నగారూ ఏంకథ బావుంటుందో!’’ అంటూ ఉత్సాహంగా ముందుకువంగి కూర్చుంటుంది రంభ.‘‘బాగానే ఉంది. మాకే మంచి కథల్దొరక్క అవస్తగా ఉంటే నీకేం చెప్పేది...మీరే చెప్పండి’’రంభ ముభావంగా ఇంద్రుడి వైపు చూస్తుంది...ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకుని‘‘మూమూలు కథల కంటే పురాణగా«థలే మేలంటాను చక్రపాణిగారూ...ఎందువల్లంటే వాటివల్ల పుణ్యమూ, పురుషార్థమూ లభిస్తుంది. దేవదానవ వైరమనేది యుగయుగాల సమస్య. అటువంటి కథా వస్తువు తీసుకొని, రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథ ఉంటుంది’’‘‘చెత్త చేస్తానంటావ్. అంతేగా! అసల్నువ్వు ఎటువంటోడివంట! ఆ తల్లేని రాక్షసులు అరణ్యాలూ, కొండలూ, గుహలు పట్టుకుని బ్రతుకుతుంటే, వాళ్లని చూసి నువ్వు ఇంత దూరాన్నించే ఒణుకుతుంటివి...వాళ్లొచ్చి నిన్నేం అవస్తలు పెడుతున్నారంట! అసలు వాళ్లు తల్చుకుంటే నిన్నిక్కణ్ణుంచి ఎప్పుడో పీకేసేవాళ్లంటా నేను’’ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వెనక్కి జరుగుతాడు. రంభ సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ...‘‘పోనీ మన బృహస్పతులవారి చేత వ్రాయిద్దామా’’ అంటుంది.‘‘ఏంటి! నీ జాతకమా! సినిమా కథ ఆయనేం రాస్తాడు! ఆయన్రాస్తే ఆయనలాంటోళ్లు జూడాల్సిందే’’ఇంద్రుడు కాస్త భయపడుతూనే ‘‘చూడండి చక్రపాణిగారూ! భూలోకంలో కత్తియుద్ధాలూ, నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది...మరి మనకు రంభతో బాటు ఊర్వశీ, మేనక, తిలొత్తమాదినాట్యకత్తె లెందరో ఉన్నారు’’‘‘వాళ్ళాడితే ఎవుడు జూస్తాడు నువుదప్పితే...ఏనాటి మేనక! ఏనాటి తిలోత్తమ! నీ దగ్గిర ‘పెన్షన్’ తీసుకుని బతికే ఆ ముసలొళ్ల చేత ఏం ఆడిస్తావులే...ఏదన్నా సెంటిమెంటుండాలో కథలో...లేదంటేగుండమ్మకథలాగానన్నా ఉండాలా...అయ్యన్నీ మీరేం తీస్తారుగానీ,ఏదన్నాగొప్పోడి కథ తీస్తే బాగుంటది’’ఇంద్రుడు కోపంతో, అవమానంతో కంపించిపోతాడు లోలోపలే. రంభ కాస్త గాభరపడుతూ...‘‘అదికాదు చక్కన్నగారూ, గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి! దేవతల్లో ఉంటాయి’’‘‘అని మీరు చెప్పుకోవాల్సిపందే. గొప్పగుణాలుండే రాక్షసుల్లేరూ? చెప్పమంటావా! బలి న్దీసుకో! బలి ఎట్టాంటోడు! ఎంత గొప్పోడు! ఆడి కాలిగోటికి పోల్డే మీ ఇంద్రుడు! వాడుతన కంటే గొప్పోడవుతున్నాడనంగానే వాన్ని పాతాళానికి తొక్కించిందాకా నిదురబోలేదే ఇతను. బలిని పాతాళానికి తొక్కినా అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది. ఈరోజు బలి గొప్ప దాతంటారుగాని, ఇంద్రుణ్నెవురుజెప్పుకుంటారు! సోదిలో గూడారాడే!’’రంభ ఇంద్రుడి ముఖం చూస్తుంది. ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతుంటాడు లోలోపలే. రంభ చూపులు కిందికి దించుకుని ‘‘మరి బలిచక్రవర్తి కథకు మాటలూ, పాటలూ కావలిగా!...వాళ్లంతా...’’‘‘అక్కణ్ణించి రావాల్సిందే...అంతేగాదు ఇంకా శానమంది రావాలి. టెక్నిషియన్సూ, మ్యూజికోళ్ళూ, కెమెరా, సౌండ్ ఎక్విప్‌మెంటూ, లైట్లు, లైట్ బాయిసూ, ప్లేబేక్ వాళ్లూ్ల, మిగతా ఆర్టిస్టులందరూ అక్కణ్ణించి రావల్సిందే...ఇక్కడోళ్లెవరూ పనికిరారు’’‘‘ఎందకని చక్కన్నగారూ! ఇక్కడ కూడా ఎందరో కళాకారులున్నారే’’ అంటుది రంభ కాస్త రోషంతో...‘‘ఉంచొచ్చుగానీ, మా ‘నేటివిటీ’ రాదుగా! అట్టనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులూ, టెక్నిషియన్లూ లేకనా–ఎక్స్ట్రా దగ్గర్నుంచి బొంబాయినించే రావాలంటారు–మెడ్రాసులో హిందీ పిక్చర్ తీసే బొంబాయోళ్లంతా...ఎవడి భాషవాడికిగొప్ప...రంభ తప్ప మిగతా అంతా మా వోళ్లు రావాల్సిందే’’ అని చక్రపాణిగారు అంటుండగానే అయిదుగురు గంధర్వులు ‘ఆర్క్ లైట్లు’లా కండ్లు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడిచెవిలో ఏదో చెప్తారు.వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాల్న లేచి నిలబడి ‘‘ఔరా! నే నెంత మూర్ఖుణ్ణి! మతి లేని రంభ కోసం నా వివేకాన్ని కోల్పోయాను. అజ్ఞానంలో పడి అంతా మర్చిపోయాను. నా ఇంద్రత్వాన్నే కోల్పోయే పరిస్థితికి జారిపోయాను. ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యురాలు రంభ వల్ల జరిగింది’’ అని ఇంద్రుడు ఆవేశంతో అంటుంటే చక్రపాణిగారు తాపీగా మిగిలిన విస్కీ చివరిగుటక తాగి గ్లాసు టేబిల్ మీద పెడతారు.ఇంద్రుడు శపిస్తాడోనని రంభ గజగజా వణుకుతూ నిలబడుతుంది.‘‘దేవేంద్రా, మానవులంటే వానరజాతి, ఇంద్రలోకం ధ్వంసం కాకముందే ఇతడిని తక్షణం పంపివెయ్యండి’’ అంటూ గంధ్వర్వులుచెప్తుండగానే....‘‘ఇదుగో ఈ క్షణమే’’ అంటూ ఇంద్రుడి ముందు మత్తుగా కూర్చున్న చక్రపాణిగారి చెయ్యి పట్టుకొని లాగి కింద పడేస్తాడు.తన గదిలో మంచం మీద నిద్రపోతున్న చక్రపాణిగారు దుబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కు కూచుంటాడు. ∙ భానుమతీ రామకృష్ణ -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్‌గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
నవ్వులే నవ్వులు
మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తాను రాసుకున్న కథ కూడా నిజమే అంటున్నాడు దర్శకుడు శ్రీ హర్ష మండ. ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామ చక్కని సీత’. క్రొకోడైల్ క్రియేషన్స్, లియో సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై విశాలాక్ష్మి మండ, జి.ఎల్. ఫణికాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీ హర్ష మండ సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. కేశవ కిరణ్ సంగీతం, మురుగన్ గోపాల్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. ప్రియదర్శి, కాశీ విశ్వనాథ్, అభయ్, ‘బుల్లెట్’ భాస్కర్, ‘జబర్దస్త్’ అప్పారావు, మధుమణి, రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
స్వర్గలోకానికి స్వాగతం
‘‘విక్రమార్కా... మన ఇంద్ర తెలుసుకదా నీకు?’’ అడిగాడు భుజం మీది భేతాళుడు.‘‘నాకు తెలియకపోవడం ఏమిటి! దాయి దాయి దామ్మ నా ఫేవరెట్ సాంగ్’’ వీణ డ్యాన్స్ చేస్తూ చెప్పాడు విక్రమార్కుడు.‘‘నేను చెప్పేది ఇంద్ర సినిమా గురించి కాదు... ఇంద్రుడి గురించి, స్వర్గలోకాధిపతి దేవేంద్రుడి గురించి. ఆయన ఈమధ్య తరచుగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడట. ఎందుకో చెప్పకపోతే... నీ తల హాంఫట్’’ అని హెచ్చరించాడు భేతాళుడు.విక్రమార్కుడు చెప్పడం మొదలుపెట్టాడు....∙∙ అనగనగా ముగ్గురు వ్యక్తులు. చీమకు కాదు దోమకు కూడా హాని తలపెట్టని మహానుభావులు. ఒకరోజు ఏదో పనిమీద ఈ ముగ్గురూ కారులో ప్రయాణిస్తున్నారు. వెళుతూ వెళుతూ ఒక వర్షం కురిసిన రాత్రి ఈ కారు వెళ్లి ఒక చెట్టును ఢీకొట్టింది. అంతే, ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. సరాసరి స్వర్గానికి వెళ్లిపోయారు. అక్కడ కొండవీటి చాంతాడంతా క్యూ ఉంది.‘‘పాపం పెరిగింది... పాపం పెరిగింది అంటాంగానీ అంతా ఉత్తదే. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. సినిమా టికెట్ కౌంటర్ల దగ్గర కూడా ఇంత క్యూ ఉండదు’’ అన్నాడు ముగ్గురిలో ఒకరు.‘‘నిజమే సుమా!’’ అన్నారు ఇద్దరు స్నేహితులు.స్వర్గద్వారాలు అప్పుడే తెరిచారు.ఇక అంతే...‘నేను ముందు అంటే కాదు నేను ముందు’ అంటూ జనాలు తోసుకోవడం స్టార్ట్ అయింది.ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. పెద్దగా అరుపులు కేకలు.ఈలోపు ఎవరిదో పర్స్ కొట్టేశారు. ఒకరి సెల్‌ఫోన్ దొంగిలించారు.‘‘అయ్యో నా పర్సు...’’‘‘అయ్యో నా సెల్‌ఫోన్’’‘‘షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి నా ఉంగరం కొట్టేశాడు’’ఈ శబ్దాలను మించిన శబ్దంతో...‘‘దయచేసి ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. సైలెన్స్‌గా ఉండండి. నాపేరు పరోపకారి పాపన్న. ఇంద్రుడిగారి పర్సనల్ సెక్రెటరీని’’ అని అరిచాడు బంగారు కిరీటం పెట్టుకున్న పొడవాటి వ్యక్తి.‘‘ఇంద్రుడి సెక్రటరీ వచ్చాడు’’ అనేమాట చెవిన పడగానే అందరూ సైలెంటైపోయారు.పీయే మళ్లీ మాట్లాడం మొదలు పెట్టాడు...‘‘డీయర్ ఫ్రెండ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. సపోజ్ మీరు కాకినాడకు వెళ్లాలనుకొని సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి తెలుగు టీవీ సీరియలంత క్యూలో నిల్చొని నానా ఆపసోపాలు పడి టికెట్టు కొంటారు. తీరా ట్రైన్ ఫ్లాట్‌ఫాం మీదికి వచ్చాక రెట్టింపు ప్రయాణికులు. కొందరు కిటికీలో నుంచి కూడా ట్రైన్లో దూరడానికి ప్రయాత్నిస్తుంటారు. ఓరి నాయనో ఈ ట్రైన్లో వెళితే కాకినాడకు వెళ్లం... సరాసరి నరాకానికి వెళతాం. బతికుంటే దీని తరువాతి ట్రైన్ బఠానీలు అమ్ముకోవచ్చు అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంటారు. సేమ్ టు సేమ్ అండీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీ అందరి దగ్గర స్వర్గానికి రావడానికి అవసరమైన టికెట్లు ఉన్నాయి. సీట్లేమో చా....లా తక్కువగా ఉన్నాయి.’’ అని నసిగాడు పీయే.‘‘ఇప్పుడేమంటావు? నరకానికి వెళ్లమంటావా ఏమిటి?’’ ఒకాయన వీరావేశంగా దూసుక్చొడు. ‘‘ఎందుకయ్యా అంత కోపం. ఇక్కడ సీట్లు లేవంటే నరకానికి వెళ్లమని కాదు కదా అర్థం’’ అన్నాడు పీయే.‘‘అంటే మళ్లీ వెనక్కి... అదే భూలోకానికి వెళ్లమంటావా ఏమిటి? అలా వెళితే ఇంకేమైనా ఉందా! దెయ్యం, దెయ్యం అంటూ అందరూ పారిపోతారు’’ అన్నాడు ఇంకో ఆయన ఆవేదనగా.ఇంతమందికి స్వర్గంలో ప్రవేశం ఎలా కల్పించాలని ఒకవైపు పరోపకారి పాపన్న తల మీద జుట్టు పీక్కొనుచుండగా మరోవైపు ఏం జరుగుతుందో చూడండి...ఒక దగ్గర:‘జస్ట్ రెండు కోట్లు... రెండే కోట్లు’ అని అందరి చెవిలో రహస్యంగా చెబుతూ పోతున్నాడు ఒకడు. అతని చేతిలో నలుపు రంగులో టికెట్లు ఉన్నాయి.‘‘ఏమిటిది?’’ అని ఆరాతీశాడు ఒక పెద్దాయన.‘‘కనిపించడం లేదా? బ్లాక్టికెట్స్’’ అన్నాడు ఆ వ్యక్తి మెల్లగా.‘‘బ్లాక్టికెట్లా? ఇక్కడ సినిమా హాలు ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ బోసినోరు పెద్దాయన.‘‘స్వర్గం ఉంది. ఆ స్వర్గంలోకి వెళ్లామంటే ఒక్కటనేమిటీ వందలాది సినిమా హాళ్లు కనిపిస్తాయి. రంభ, ఊర్వశీ, మేనకల లైవ్డ్యాన్స్ పోగ్రాం చూడొచ్చు. ఇంకా....’’ అంటూ చెప్పుకుపోతున్నాడు ఆ గళ్ల చొక్కా వ్యక్తి.ఈలోపు హెవెన్ పోలీస్ స్క్వాడ్ వాళ్లు అక్కడికొచ్చి గళ్ల చొక్కా వ్యక్తిని నాలుగు బాది సెల్లో వేశారు.‘‘ష్...ష్....’’ అంటూ సుబ్బారావు అప్పారావును రహస్యంగా గిచ్చాడు.‘‘ఏమిటి?’’ అన్నాడు గిచ్చబడిన అప్పారావు.సుబ్బారావు: కోచింగ్ సెంటర్‌కు నాతో పాటు వస్తావా!అప్పారావు: కోచింగ్ సెంటరేమిటి?! మనమేమన్నా ఎమ్సెట్ ఎగ్జామ్స్ రాస్తున్నామా! సుబ్బారావు: ఎమ్సెట్ కాదు హెవెన్సెట్ అప్పారావు: హెవెన్సెటా? అదేమిటి? సుబ్బారావు: స్వర్గంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ హెవెన్సెట్ ప్లాన్ చేశారు. ఇందులో మంచి ర్యాంకులు తెచ్చుకున్నవాళ్లకే స్వర్గంలో ప్రవేశం ఉంటుందట. మనకు సీటు దొరకాలంటే స్టార్ కోచింగ్ సెంటర్లో చేరడం మంచిది. ఈ కోచింగ్ సెంటర్లో చేరిన వారికి గతంలో మంచి మంచి మార్కులు వచ్చాయట’’మరో దగ్గర:‘‘ఒరేయ్ గుర్నాథం... నీకో బ్రేకింగ్ న్యూస్!’’‘‘బ్రేకింగ్ న్యూస్‌ల గొడవ ఇక్కడ కూడా తప్పడం లేదా! ఏమిటో చెప్పు’’‘‘హెవెన్సెట్ పేపర్ లీకైందట!’’‘‘పేపర్ లీకైందా? ఇప్పుడెలా?’’‘‘గ్యాస్ లీకైనట్లు ముఖం పెడతావేమిటి? ఆ లీక్ చేసిన వాడు మా ఫ్రెండ్ బామ్మర్దికి స్వయాన బావ. నువ్వు ఓకే అంటే నేను బేరం మాట్లాడతాను’’‘‘డబ్బులదేముంది. పాపిష్ఠి డబ్బు. మనకు స్వర్గం ముఖ్యం’’∙∙ నిద్రలోకం నుంచి ఉలిక్కిపడి లేచాడు ఇంద్రుడు.‘‘ఏమిటి అలా లేచారు?’’ అడిగింది ఆయన భార్య కంగారుగా.‘‘ఏమిలేదు దేవీ. రాత్రి ఒక పీడడ్రీమ్ వచ్చినది. ఆ డ్రీమ్‌లో స్వర్గంలోకి ప్రవేశించడానికి కొందరు మానవులు రకరకాల వక్రమార్గాలు అనుసరిస్తున్నరట. నాకేందుకో భయముగా యున్నది’’ అన్నాడు ఇంద్రుడు.‘‘ఈ మానవులు ఎంతకైనను తెగించువారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని ఇంద్రుడికి జాగ్రత్తలు చెప్పింది శచీదేవి. – యాకుబ్ పాషా -
మైండ్ గేమ్
‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్ స్కెచ్’ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్‌ని. వారియర్ కరాటే ఇంటర్న్షనల్ ఫౌండేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్ స్కెచ్’ సినిమాలో విలన్‌గా నటించాను. మైండ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే, ది ఎండ్’.. వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) ముఖ్య తారలు. యు అండ్ ఐ– ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్ మాట్లాడుతూ– ‘‘జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ‘సూపర్ స్కెచ్’ టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్లో మరో హిట్ చిత్రం ఖాయం. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
థ్రిల్‌కి గురి చేసే స్కెచ్
నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. రవిచావలి దర్శకత్వంలో యు అండ్ ఐ బ్యానర్ సమర్పణలో బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రవి చావలి మాట్లాడుతూ – ‘‘సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రతి నిమిషం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు థ్రిల్ కలుగుతుంది. ఈ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడే నర్సింగ్ మక్కల క్యారెక్టర్ సూపర్బ్‌గా ఉంటుంది. సురేంద్రగారు అద్భుతమైన విజువల్స్ ఇస్తే, కార్తీక్ మ్యూజిక్, నేపథ్య సంగీతంతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు’’ అన్నారు. ‘‘కథ వినగానే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కుదిరితే బావుంటుందని అనుకున్నాం. స్క్రీన్‌ప్లే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాం. జూన్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఇంద్ర, నర్సింగ్ మక్కల తదితరులు పాల్గొన్నారు. -
హత్యకు స్కెచ్
‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్) కీలక పాత్రలు చేశారు. ఎరోస్ సినిమాస్ సమర్పణలో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా నర్సింగ్ నటన ఈ సినిమాకి హైలైట్. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరా: సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
చిన్నారి ‘ఇంద్ర’ హీరోగా..!
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న నటుడు తేజ సజ్జ. ముఖ్యంగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఇంద్ర, చూడాలని ఉంది లాంటి సినిమాలు తేజకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. యువరాజు, వసంతం, శ్రీరామదాసు లాంటి సినిమాలతో ఆకట్టుకన్న తేజ తరువాత వెండితెరకు దూరమయ్యాడు. హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజాగా తేజకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. చిన్నారి ఇంద్రగా ఆకట్టకున్న తేజ ఓ క్యూట్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. మిణుగురులు సినిమాతో ఆకట్టుకున్న అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తేజ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కుమారి హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
నాలుగు శతాబ్దాల కథ!
చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్ మూవీస్‌కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్ వర్క్స్ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్. -
పెద్ద చిన్ని...!
ఒకటా.. రెండా.. మూడా... అన్నీ పెద్ద సినిమాలే... స్క్రీన్ మీద పడితే బాంబుల్లా పేలాయ్... ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాయ్... అంత పెద్ద సినిమాలు రాసింది చిన్నికృష్ణ... మరి అలాంటి పెద్ద రైటర్ చిన్నబోయాడు ఎందుకు? పెద్ద కథ వెనక ఓ చిన్ని గాథ... ♦ ‘నరసింహనాయుడు’ (2001)తో రైటర్‌గా ఎంటరై, ఈ పదిహేనేళ్లల్లో జస్ట్ ఐదు సినిమాలే చేశారేం? 2002లో ‘ఇంద్ర’, 2003లో ‘గంగోత్రి’, 2011లో ‘బద్రినాథ్’, 2012లో ‘జీనియస్’ చేశా. ఆమిర్‌ఖాన్‌తో వర్క్ చేయాలనేది నా జీవితాశయం. ‘జీనియస్’ తర్వాత ఆమిర్ కోసం స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. లాస్ట్ ఇయర్ పూర్తి చేశా. హిందీ వాళ్ల తో డైలాగ్స్ రాయించా. వచ్చే నెల్లో ఆమిర్‌కి సబ్మిట్ చేస్తా. ♦ నరసింహనాయుడు, ఇంద్ర.. ఇలా మీరిచ్చినవన్నీ మామూలు కథలు కాదు. అసలా కథలకు ఇన్స్పిరేషన్ ఏంటి? నేను గాడ్ బిలీవర్ని. ఉదయం నిద్ర లేచాక మంచం మీద నుంచి కాలు కింద పెట్టేటప్పుడు నా భారాన్ని మోసే భూదేవిని క్షమించమని అడుగుతాను. నిద్రపోయే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తా. దేవుడి ఇన్ఫ్లూయన్స్, నేచర్ ఇన్ఫ్లూయన్స్ లేకుండా నాకు స్క్రిప్ట్ రాయడం అనేది రాదు. రాసే ప్రతి అక్షరం నేను రాశానని ఎప్పుడూ ఫీల్ కాలేదు. ఆ భగవంతుడే, ఆ అమ్మవారే రాయిస్తున్నారు. ♦ మధ్య మధ్యలో మీ కెరీర్లో వచ్చే బ్రేక్స్‌కి కారణం ఏంటి.. ఎవరూ అవకాశాలు ఇవ్వడంలేదా? అవకాశాలు రాలేదు అనేది లేదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. చిరంజీవిగారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరిన మీదట గ్రాండి యర్‌గా ఓ కథ రెడీ చేశాను. కానీ, చిరంజీవిగారు ‘కత్తి’ రీమేక్ చేయాలనుకున్నారు. నా కథ కంటే ‘కత్తి’ బాగుందనుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన మేటర్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చెప్పలేదు. అది నా నమ్మకం. చిరంజీవిగారు నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకూ నా జడ్జ్మెంట్ ఫ్లాప్ కాలేదు. నేను డెలివర్ చేసిన ఏ గూడ్స్ (సినిమాలు)నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. ఆ క్లారిటీ నాకుంది. ♦చిరంజీవిగారికి ‘ఇంద్ర’లాంటి హిట్ స్టోరీ ఇచ్చారు. ఇప్పుడు మీ కథను నమ్మలేదంటే..? నేను చెప్పింది ఆయన అంగీకరించలేదని చెడుగా మాట్లాడితే నేను క్రియేటర్‌నే కాదు. అది చిరంజీవిగారి వ్యక్తిగత నిర్ణయం. దట్సాల్. సినిమా వాళ్లందరూ కష్టపడేది ప్రేక్షకుడి కోసమే. నూన్ షో తర్వాత ప్రేక్షకుడు డిసైడ్ చేసే వరకూ ఎవరూ మాస్టర్స్ కాదు. రిలీజ్‌కి ముందే రిజల్ట్ చెప్పేమాస్టర్స్ ఎవరైనా ఉంటే దేవుడితో సమానం. తమిళ ‘కత్తి’ చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ♦రైటర్స్ ఎంత రాసినా స్క్రీన్ మీద కనిపించే హీరోనే ఆరాధిస్తారు.. దీనికి మీరేమంటారు? నాకు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఇష్టం. సంక్రాంతి, శివరాత్రి అప్పుడు ఎన్టీఆర్, ఏయన్నాఆర్ గార్లలా గెటప్స్ వేసుకుని కొందరు డ్యాన్సులు చేసేవాళ్లు. అప్పటివరకూ అదే వ్యక్తులు బీడీ తాగుతూ కనిపించేవాళ్లు. ఏమీ అనిపించేది కాదు. మేకప్ వేసుకుని స్టేజి మీద డ్యాన్సులు చేస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నదీ, స్క్రీన్ మీద కనిపించేదీనటుడు. నటుడికున్న వేల్యూ అది. గత జన్మలో మినిమమ్ వంద గుళ్లు కట్టిస్తే.. ఈ జన్మలో ఆర్టిస్ట్‌లు అవుతారని నమ్ముతా. దటీజ్ స్టార్డమ్. ♦స్టార్డమ్ గురించి గొప్పగా చెప్పారు.. మరి ఆ స్టార్స్ దగ్గరకు మీరే వెళ్లి కథలు చెప్పడానికి ఎందుకు మొహమాటం? మొహమాటం కాదు. ‘నరసింహనాయుడు’లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘కళామతల్లి అనేది సరస్వతి అమ్మవారితో సమానం. కళ దగ్గరికి మీ అమ్మాయి రావాలి గానీ, మీ అమ్మాయి దగ్గరికి కళ రాదు’. ఈ డైలాగ్ నేనే రాశాను. రియల్ లైఫ్‌లో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాను. ♦ రామ్‌చరణ్ డెబ్యూ మూవీ కోసం ‘పూరీ జగన్నాథ్’ అని కథ రాశారట. రియల్ పూరీ జగన్నాథ్ (దర్శకుడు) ఎంటర్ కాగానే ఆ సినిమా మీ చేతుల్లోంచి తీసేసుకున్నారట? కథ రాశాను. క్లైమాక్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు చిన్నికృష్ణ రైటర్, పూరీ జగన్నాథ్ డెరైక్టర్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూరీగారు తెలుగులో వన్నాఫ్ ది రెస్పెక్టబుల్ రైటర్స్. వెరీ గుడ్ ఫిలాసఫికల్ రైటర్. నా కథ ఓకే చేసిన తర్వాత ‘పోకిరి’ అనే సినిమా విడుదలై, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. సో, అతనితో వెళ్లడం కరెక్టే. నా కొడుకు హీరో అవుతున్నా.. నేనూ అదే నిర్ణయం తీసుకుంటా. ఓ రచయిత కథ కంటే.. మహేశ్‌బాబుతో పెద్ద హిట్టిచ్చిన ఓ రైటర్ కమ్ డెరైక్టర్‌తో వెళ్లడంలో తప్పు లేదు. ♦మీ దగ్గర ఉన్న కథల గురించి చెబితే తప్పేంటి? నేను రాస్తానని అందరికీ తెలుసు కదా. కొందరు బిచ్చగాళ్లు గంగిరెద్దులతో అడుక్కోవడానికి వస్తుంటారు. చిన్నికృష్ణ ఆల్రెడీ ఓ గంగిరెద్దులా అడుక్కుని, ఓ హిట్ ఇచ్చాడని తెలుసు కదా. నాకు మళ్లీ గంగిరెద్దు వేషం ఎందుకు? నేనిక్కడే (హైదరాబాద్) ఉంటున్నానని తెలుసు. నా ఇంటి గృహప్రవేశానికి కూడా వచ్చారు. గత పదిహేనేళ్లుగా నా ఫోన్ నంబర్ మారలేదనీ తెలుసు కదా. ♦ఇలా మాట్లాడతారు కాబట్టే, కొంతమంది మిమ్మల్ని ‘హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ చిన్నికృష్ణ’ అని అంటుంటారు.. గుడ్ క్రెడిట్. ఆఫీసు రూముల్లోనో, బెడ్‌రూమ్‌లోనో అనుకోకుండా ఏదైనా అవార్డు వేడుకలో ‘అండ్ ది హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ అవార్డ్ ఫర్ 2016 గోస్ టు చిన్నికృష్ణ’ అని బహిరంగంగా అవార్డు ఇస్తే ఆనందపడతా. అది మంచి క్రెడిట్. నన్ను ఈగోయిస్ట్ అనడం వల్ల వాళ్లకు ఆనందం దక్కుతోందంటే కాదనడానికి నేనెవర్ని? ♦తారాచౌదరి విషయంలో మీపై విమర్శలు వచ్చాయి కదా.. పాపం.. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్‌బ్యాలెన్స్. ఆ తర్వాత చాలాసార్లు అరెస్ట్ అయ్యింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ సోదరుడిగా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి లైఫ్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకా అమ్మాయి మీద కోపం లేదు. ♦మీ మీద వచ్చే కాంట్రవర్శీస్ గురించి మీరేమంటారు? ఐశ్వర్యా రాయ్‌తో అభిషేక్ బచ్చన్ పెళ్లి జరుగుతోంటే ‘నాకు ఇతను కడుపు చేశాడు’ అని ఓ అమ్మాయి వస్తుంది. ఇలాంటి గాసిప్స్ సినిమావాళ్లకు కామన్. టీవీలో 10 సెకన్ల యాడ్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఏ ఖర్చూ లేకుండా వార్త వచ్చినప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చుని నవ్వుకుంటా. టీవీ వాళ్లకీ రేటింగ్ బాగుంటుంది. ♦యాడ్ పాజిటివ్‌గా ఉంటే ఓకే.. మీ మీద వచ్చేవి నెగిటివ్...? (ప్రశ్న పూర్తి కాకముందే..) యాడ్ నెగిటివ్‌గా ఉంటేనే బాగుంటుంది. ‘చిన్నికృష్ణ 200 మందికి అన్నదానం చేశాడు’ అంటే, దాని గురించి రాయరు, చూపించరు. ‘చిన్నికృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మా యి తప్పించుకుంది. ఓ సీసీ కెమేరాలో దొరికాడు’ అంటే రేటింగ్ ఎంత ఉంటుందో చూడండి. మీడియాలో నెగిటివ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ పాజిటివ్ ఎనర్జీ. ♦జనరల్‌గా గ్యాప్ వచ్చినప్పుడు ‘వీళ్లు ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారా? ఇప్పటి తరానికి కావల్సినది ఇవ్వగలుగుతారా?’ అనే సందేహం ఉంటుంది.. మరి.. మీ కథలు? ఆర్టిస్టులకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ, రైటర్స్‌కి రిటైర్మెంట్ ఉండదు. ఆ మధ్య ఓ పెద్ద నిర్మాతను కలిశా. ఆయన పేరు కేయస్ రామారావు. ఆయన తారక్‌కి (ఎన్టీఆర్) కథ ఇవ్వాలన్నారు. అలా అంటూనే... ‘‘ఇప్పుడున్న హీరోలందరూ మంచి యంగ్‌స్టర్ స్క్రిప్ట్స్ ఇష్టపడుతున్నారు. మీరు, విజయేంద్రప్రసాద్‌గారు.. ఓల్డ్ స్మెల్ కదా’’ అన్నారు. పాపం ఆయనది తప్పు కాదు. రామారావుగారికి ఎవరో యంగ్ హీరో యంగ్‌స్టర్ స్టోరీ కావాలని చెప్పి ఉంటారు. ఆయన చెప్పినది ఈయన నాతో అని ఉంటారు. కానీ, వాళ్ల మనసుకి అర్థం కావాలి కదా. రామారావుగారు అలా అనగానే నేనేం మాట్లాడలేదు. జస్ట్ ‘అవునండి..’ అని వచ్చేశాను. నేను బాగా గౌరవించే వన్నాఫ్ ది బెస్ట్ రైటర్స్ విజయేంద్రప్రసాద్. ఆయనంటే చాలా అభిమానం. రామారావుగారు నాతో అలా మాట్లాడిన కొన్నాళ్లకు మా విజయేంద్రప్రసాద్‌గారు రాసిన ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజన్’ విడుదలయ్యాయి. అలాగని రామారావుగారికి ఫోన్ చేసి, ‘దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న ఆ రెండు కథలూ రాసినది మా ఓల్డ్ రైటరే. ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నవ్వలేదు. అంత దిగజారే మనిషి కాదు నేను.. నాకో ఐడెంటిటీ, గుర్తింపు వచ్చింది రజనీకాంత్‌గారి ‘నరసింహా’ వల్లే. ఆ కథను యాక్సెప్ట్ చేసినందుకు రజనీగారికీ, చిత్రదర్శకుడు కేయస్ రవికుమార్గారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగులో బాలకృష్ణగారు, చిరంజీవిగారు. పేర్లు ఆర్డర్లో చెబుతున్నాను. ఒకళ్లు ఎక్కువ, ఒకళ్లు తక్కువ అని కాదు. అల్లు అర్జున్‌గారు, ఓంకార్‌గారు. వీళ్లందరూ నన్ము నమ్మి కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుల్లో బి.గోపాల్గారు, రాఘవేంద్రరావుగారు, వీవీ వినాయక్‌గారు.. వీళ్లందరికంటే ముందు ఇతని కథ హిట్ అవుతుందని, ఇతను పెద్ద రైటర్ అవుతాడని చెప్పిన పరుచూరి బ్రదర్స్‌లో పరుచూరి గోపాలకృష్ణగారికి.. జన్మజన్మలకు నేను రుణపడి ఉంటా. ఎటువంటి ఈగో లేకుండా వాళ్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ♦ మీరన్నట్లు హీరోల్లా రైటర్‌కి రిటైర్మెంట్ లేకపోయినప్పటికీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటేవెనకపడిపోయినట్లే కదా? నన్ను చూస్తే.. వెనకపడిపోయినట్లుగా అనిపిస్తోందా? గడ్డం పెంచుకుని, చెట్టు కింద కూర్చుని కథలు రాసుకుంటూ, ఓ చేత్తో సగం కాలిన సిగరెట్టు పట్టుకుని ఆకాశంలో శూన్యంలోకి చూస్తూ..అదే చెట్టు కింద నేను పడిపోయి.. ‘అయ్యో... ఫలానా రచయిత’ అంటూ ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, జాలిపడేలా నేను కనిపిస్తున్నానా? లేదు కదా. హ్యాపీగానే ఉన్నానుగా. నేను ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీని నమ్ముతాను. ఏదీ మన చేతుల్లో ఉండదని నా ఫీలింగ్. ♦మీ భవిష్యత్తు గురించి మీ ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీ ఏం చెబుతోంది.. రేసీగా సినిమాలే చేస్తారంటోందా? అక్టోబర్ నుంచి బాగుంటుందని చెబుతోంది. అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నవ్వొచ్చే విషయం ఒకటి చెప్పాలి. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడితే కిక్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక్కటే ఆడితే? కిక్ ఉండదు కదా. ఇప్పుడున్న సినిమాల పరిస్థితి కూడా అంతే. కిక్ లేదు. ♦అదేంటి..? ఇప్పుడు కాంపిటీషనే లేదు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’, చిరంజీవిగారి ‘మృగరాజు’, వెంకటేశ్‌గారి ‘దేవీపుత్రుడు’ ఒకే రోజున (జనవరి 11) విడుదలయ్యాయి. స్టేట్ మొత్తం హీట్. ఏది బెస్ట్ రిజల్ట్ అనే ఎగ్జైట్మెంట్. అలాంటి కిక్ ఇప్పుడు లేదు. సినిమాలన్నీ దాదాపు కాంపిటీషన్ లేకుండా సోలోగా విడుదలవుతున్నాయ్. ♦వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పడనున్నాయి? ఇద్దరితోనూ మీరు సినిమాలు చేశారు. మరి.. ఈ రెండు సినిమాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రెండు సినిమాలూ ఆడితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవిగారు చేస్తున్న సినిమా ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీలాంటిది. తమిళ ‘కత్తి’కి రీమేక్ అది. పోటీలో ఉన్నవి రెండూ స్ట్రయిట్ చిత్రాలైతే మాట్లాడగలను. రీమేక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమా. ఇంకోటి చరిత్ర చెప్పే సినిమా. సో.. రెండింటినీ పోల్చలేం. కంపేర్ చేయాలంటే రెండూ స్ట్రెయిట్ సబ్జెక్ట్సే తీసుకోవాలి. అప్పుడది కాంపిటీషన్ అవుతుంది. దట్ ఈజ్ ద రియల్ వర్త్ ఆఫ్ రన్నింగ్ రేస్. ♦ఎక్కడ కామెడీ, ఎక్కడ రౌద్రం ఉండాలో చిన్నికృష్ణకు తెలు సని వినాయక్ ఓ సందర్భంలో అన్నారు. ఎలా నేర్చుకున్నారు? భాగ్యరాజాగారు నా గురువుగారు. ఏది ఎక్కడ ఎంత కొలతలో ఉండాలో నేర్చుకున్నది ఆయన దగ్గరే. డెరైక్టర్ శంకర్‌గారి దగ్గర చేయకపోయినా ఆయన కూడా నా గురులాంటివారే. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్టిక్ట్స్ అని రెండు ఉంటాయి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనుబంధాల చుట్టూ తిరుగుతాయ్. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్ సమాజంతో ముడిపడి ఉంటాయ్. శంకర్‌గారు, మురుగదాస్‌గారు చేసే సినిమాలన్నీ అవుటర్ కాన్ఫ్లిక్ట్స్. నా ‘బద్రినాథ్’ అలాంటి సినిమానే. ఆ సినిమా అప్పట్నుంచీ నా ఆలోచనా విధానం మారిపోయింది. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్లో కథలు రాస్తున్నా. ♦సాధారణంగా అల్లు అరవింద్‌గారు కథ రాశాక పారితోషికం ఇస్తారట.. కానీ, మీకు ముందే ఇచ్చారట? ఆయన హృదయంలో నాకు సెపరేట్ స్థానం. మా పాప ఫైనలియర్ అప్పుడు బన్నీ హీరోగా నాతో మళ్లీ సినిమా చేస్తా అన్నారు. ♦మరి ఏమైంది..? అన్నారు కదా అని కథ రాసేసుకుని, తెల్లారేసరికల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడలేం కదా. ఆ సమయంలో ఏ పనావిడో కళ్లాపి జల్లుతూ ఉంటుంది. ఆ కళ్లాపికి నేనెందుకు అడ్డం పడాలి (నవ్వుతూ). అభిమానంతో అంటారు. అన్నారు కదా అని వెంటాడేస్తే ఎలా? ♦మీ పెద్ద అబ్బాయిని హీరోని చేయబోతున్నారట? మా అబ్బాయి హీరోనా? పోయిన జన్మలో వంద గుళ్లు కట్టుంటే ఈ జన్మలో హీరోలవుతారని ఇంతకు ముందు చెప్పాను కదా. మరి మావాడు కట్టాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ వాడు వంద గుళ్లు కట్టుంటే హీరో అవుతాడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. ♦మీ కథలో యాక్ట్ చేసిన హీరోలతో మీరు టచ్‌లో ఉన్నారా? అందరితోనూ నాకు మంచి అనుబంధమే ఉంది. కాకపోతే నేను ‘భజన సంఘం’లో లేను. మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా భజన సంఘం ఉంటుంది. నేనా ట్రూప్కి చెందిన వ్యక్తిని కాదు. నా దగ్గర చిడతలు లేవు. ఒకట్రెండు సార్లు అవి ఇచ్చి, ఎలా కొట్టాలి? ఎలా కొడితే వాళ్లకు నచ్చుతుంది? ఏ సౌండ్‌ని ఇష్టపడతారు... అని కొందరు టిప్స్ ఇచ్చారు. నేను ట్రై చేసినా అవి పగిలిపోయాయి. దాంతో భజన సంఘానికి పనికి రానని ఫిక్సయ్యాను. అందుకే ఎప్పుడూ వాళ్ల చుట్టూ కనిపించను. ♦మరి.. భజన చేయకపోతే దగ్గరకు రానివ్వరట కదా? ఐ డోంట్ మైండ్. ఎవరు నన్ను కాదనుకుని సినిమా తీశారో.. ఎవరు నన్ను కాదనుకుని డెరైక్ట్ చేశారో.. ప్రకృతి వాళ్లకు అన్నీ కరెక్ట్‌గా ఇచ్చేసింది. ఆల్రెడీ వాళ్లకు దక్కింది కాబట్టి, ఇప్పుడు పనిగట్టుకుని ఎవరెవరికి ఏం దక్కింది? అని పర్టిక్యులర్‌గా నేను చెప్పడం అనవసరమైన సబ్జెక్ట్. ఎవరూ దగ్గరకు రానివ్వకపోయినా చిన్నికృష్ణ భజన చేయడు.. దట్సాల్. - డి.జి. భవాని -
మొక్కే కదా అని పీకేస్తే...
పంచ్ శాస్త్ర ‘నువ్వు నాకో హీరోను చూపెట్టు. నీకు క్షణాల్లో... ట్రాజెడి రాసిస్తా’ అన్నాడొక అమెరికన్ రచయిత. హీరో అంటే... కొండంత ధైర్యం. కొండను పిండి చేసే సాహసం. కళ్లతో శత్రువును దెబ్బతీసే నైపుణ్యం. మరి అలాంటి హీరోను పట్టుకొని ‘ట్రాజెడి రాస్తానంటాడేమిటి? కామెడీ కాకపోతే!’ అనుకోవద్దు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రాజెడి ఎంత పండితే, హీరో ధీరత్వం, శూరత్వం అంతగా పండుతాయి. పంచ్లైన్లు అంతగా పండుతాయి. అటు చూడండి తన అనుచరులతో ఇంద్రసేనారెడ్డి సునామీలా వీరశంకర్రెడ్డి ఇంటివైపుకు దూసుకొస్తున్నాడు. ఈ వీరశంకర్రెడ్డి విషకుట్రలో... ఇంద్రసేనారెడ్డి తన కుటుంబాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలా మిగిలాడు. రగులుతున్న అగ్నిపర్వతంలా మిగిలాడు. ఇప్పుడు ఆ అగ్నిశిఖ శత్రువు ఇంటి ముందుకు వచ్చింది. శత్రువు ఇంటి ముందుకు ఇంద్రసేనారెడ్డి ఎందుకు వచ్చాడు? చంపేయడానికా? కాదు... ‘కన్న కొడుకును ఎందుకు చంపేశావురా?’ అని నిలదీసి నిప్పుల వర్షం కురిపించడానికి వచ్చాడు. వీరశంకర్రెడ్డి తన కన్నకొడుకును ఎందుకు చంపుకున్నాడు? తన కొడుకును... శత్రువైన ఇంద్రసేనారెడ్డి రక్షించినందుకు!! ఇంద్రసేనారెడ్డి గర్జిస్తున్నాడు... ‘వీర శంకర్ రెడ్డీ.... ఏం చూసి పెట్టాడురా నీకు నీ అయ్య ఆ పేరు? పసిబిడ్డను చంపుతావనా? నా మీద కనురెప్ప ఎత్తే ధైర్యమైనా లేక పసిబిడ్డ మీద కత్తి దూస్తావా?’ ఇంద్రసేనారెడ్డి భుజం మీద రక్తసిక్తదేహంతో శవమై పోయిన పసిబిడ్డ- ‘‘నాన్నా నేనేం పాపం చేశానని... చంపేశావు?’’ అని వీరశంకర్రెడ్డిని మౌనంగా అడుగుతున్నాడు. ఆ పసిబిడ్డ తల్లి దుఃఖసముద్రమై రోదిస్తోంది. భుజం మీద ఉన్న పసిబిడ్డ శవాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఇంద్రసేనారెడ్డి ఆ బిడ్డ తల్లితో అంటాడు ‘అమ్మా... ఈ చేతులు కాపాడడం వల్ల నీ బిడ్డ దూరమైతే.... నన్ను క్షమించమ్మా...’ వీరశంకర్రెడ్డి అరుస్తున్నాడు... ‘నా బిడ్డను నేను చంపుకున్నా...మీకేంది రా బాధ?’ వీరశంకర్రెడ్డి చెంప చెళ్లుమనలేదుగానీ, అంతకంటే ఎక్కువ శక్తి ఉన్న ఒక డైలాగ్ అతని చెంప చెళ్లుమనిపించలా ఇంద్రసేనారెడ్డి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘నీ బిడ్డా... నువ్వు కన్నావా మోశావా?పెంచావా? రేయ్... నిన్ను పొడిస్తే అమ్మా అంటావు. ఇప్పుడు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు, నీ తమ్ముళ్లకు కత్తిగాయం ఎలా ఉంటుందో తెలుసు. ఓ తల్లికి గుండెగాయం అయితే, ఆ తల్లి పేగులకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదు. భర్త పోతే తన పసుపుకుంకుమలను పోగొట్టుకునే స్త్రీ తన బిడ్డ పోతే తన సర్వస్వం కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది చూడరా’’ ఆవేశస్థాయిని ఆర్ద్రత స్థాయికి తీసుకెళ్లి ఆ తల్లి వైపు తిరిగి ఇంద్రసేనారెడ్డి అంటాడు- ‘చూడమ్మా-నీకు నీ కొడుకు ఆకారం దూరమైందేగానీ, ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది.బాగా నీళ్లు పోసి పెంచు... పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదుగుతున్న నీ కొడుకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు... నిద్ర లేచే ముందు... అన్నం తినే ముందు ఆరు బయకు పోయే ముందు.... ఆ మొక్కకు మొక్కాలి. కాదని అడ్డంగా వాదించి ఎండ బెడితే మీ అందరికీ పాడె కడతా’ ఈ మాటలతో శత్రువుల గుండెలు వణికాయి. ఆ వణుకును తారస్థాయికి తీసుకెళ్లడానికి అన్నట్లు... ఇంద్రసేనారెడ్డి వెళుతూ వెళుతూ అంటాడు - ‘వీర శంకర్ రెడ్డి మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా!’ పంచ్శాస్త్రను పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఈ డైలాగు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. -
రాబడి చక్రాలపై రయ్ రయ్
ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారిన ఎంట్రీ ట్యాక్స్ 30 శాతాన్ని దాటిన ఆక్యుపెన్సీ ప్రైవేటు బస్సుల జోరుకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను)... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)కి వరంగా మారింది. మూడు రోజులుగా రాబడి పెరిగింది. ఎంట్రీ ట్యాక్సుతో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల జోరు కూడా తగ్గింది. దీంతో అత్యధికశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 30 శాతాన్ని మించుతోంది. ఇదిలాగే కొనసాగితే ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ నడిపే సూపర్ డీలక్స్, హైటెక్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం రూ.కోటి దాటుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ... హైదరాబాద్ నగరానికి సుమారు 800 బస్సులను నడుపుతోంది. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు పెద్దసంఖ్యలో ప్రమాదాలకు గురైనపుడు...ముఖ్యంగా షిర్టీ సమీపంలో ప్రమాదం జరిగిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్న ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ అధికారులు కట్టడి చేశారు. దీంతో అప్పట్లో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. మళ్లీ ప్రైవేటు బస్సులపై ఎంట్రీ ట్యాక్స్ ప్రభావం కారణంగా ఆ పరిస్థితి పునరావృతమైంది. నిబంధనలు గాలికి: ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిరగాల్సిన ప్రైవేటు బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటూ స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండడంతో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాన్ని కాగ్ తప్పు పట్టినా ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రైవేటు బస్సుల విషయమై రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ప్రైవేటు బస్సులను నడుపుకునే అనుమతి ఇవ్వాలని, అప్పుడే ఆర్టీసీకి మనుగడ ఉంటుందని యూనియన్ నేతలు కోరుతున్నారు.