బి. గోపాల్‌తో ఇంద్ర, సుక్రుతా వేగల్...
‘‘రామచక్కని సీత’ మంచి టైటిల్.. చాలా బాగుంది. ఈ సినిమా హీరో ఇంద్ర చాలా మంచి అబ్బాయి. తనంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మంచి విజయం సాధించి, హీరో, హీరోయిన్‌కి, యూనిట్‌కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. ఇంద్ర, సుక్రుతా వేగల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రామచక్కని సీత’. శ్రీహర్ష మండాని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాలాక్షి మండా, జి.ఎల్. ఫణికాంత్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బి.గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మండా మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ప్రోత్సహించిన దాసరి కిరణ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఫణికాంత్ నా స్నేహితుడు. నా కోసం ఈ సినిమా తీశాడు. మా చిత్రం ద్వారా ఇంద్ర, సుక్రుతా వేగల్ పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని ఇంత దూరం తీసుకువచ్చాం’’ అన్నారు ఫణీంద్ర. ‘‘మా సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశాలాక్షి. ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకి కృతజ్ఞతలు’’ అన్నారు ఇంద్ర. ‘‘కన్నడలో నేను 7 చిత్రాల్లో నటించా. తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. కన్నడ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా’’ అని సుక్రుతా వేగల్ అన్నారు. రచయిత విస్సు, నిర్మాత మల్టీ డైమన్షన్ వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment