
రామసత్యనారాయణ, రామ్‌గోపాల్ వర్మ
సుమీత్, జాకీర్, హైమ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘దెయ్యం గుడ్డిది ఐతే?’. దాసరి సాయిరాం దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం అనే కథాంశంతో ఉన్న సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘దెయ్యం గుడ్డిది ఐతే’ అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment