Sumeet
-
‘దెయ్యం గుడ్డిది ఐతే?’
సుమీత్, జాకీర్, హైమ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘దెయ్యం గుడ్డిది ఐతే?’. దాసరి సాయిరాం దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం అనే కథాంశంతో ఉన్న సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘దెయ్యం గుడ్డిది ఐతే’ అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
నార్మల్ డెలివరీ.. అందుకే ఆ పేరు: నటుడు
తమ వంశ వృక్షాన్ని అనుసరించి తన కుమారుడికి వేద్ అని నామకరణం చేసినట్లు బాలీవుడ్ నటుడు సుమీత్ వ్యాస్ వెల్లడించాడు. వేద వ్యాసుడి అంశ నుంచి వచ్చిన వాళ్లం గనుక తన చిన్నారికి ఈ పేరు పెట్టడం సరైందేనని భావిస్తున్నానన్నాడు. కాగా బీ- టౌన్ సెలబ్రిటీ జంట సుమీత్ వ్యాస్, ఏక్తా కౌల్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై మిర్రర్‌తో సుమీత్ వ్యాస్ మాట్లాడుతూ ఏక్తాకు నార్మల్ డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. ‘‘చాలా ఏళ్ల క్రితం మా బంధువుల్లో ఒకరికి కొడుకు పుట్టినపుడు తనకి ఏం పేరు పెట్టాలా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాం. అప్పుడు నాకు వేద్ అనే పేరు తట్టింది. అయితే మిగతావాళ్లు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. అందుకే నాకు భవిష్యత్తులో కొడుకు పుడితే వాడికి ఈ పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా. నిజానికి మా వంశ వృక్ష మూలపురుషుడైన వేదవ్యాసుడి పేరును ప్రతిబింబించే ఈ పేరంటే నాకెంతో ఇష్టం. ఆ అంశలో మేమున్నాం కాబట్టి.. వేద్వ్యాస్ అనే పేరు నా కొడుక్కి సరిగ్గా సరిపోతుందనుకున్నా’’అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.(నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం నుంచి బెదిరింపులు) ఇక లాక్డౌన్ కారణంగా తన తల్లిదండ్రులు, అత్తమామలు ముంబైకి వచ్చి వేద్‌ను చూసే పరిస్థితి లేదని.. ఏదేమైనా ఏక్తా, వేద్ ఆరోగ్యంగా ఉండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. కాగా డెలివరీకి ముందు ఏక్తా.. ‘పప్పా థాంక్యూ’ అంటూ సుమీత్‌తో తనకున్న అందమైన జ్ఞాపకాలను ప్రతిబింబించే ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా సుమీత్ వ్యాస్, ఏక్తా కౌల్ 2018లో జమ్మూలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. View this post on Instagram Our world is about to change. But my life has changed because of you. I am so thankful that we get to go on this ride together. So before all the screaming and diaper changing begins, I just want to say PAPA you are beautiful. Thank you !! @sumeetvyas A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on Jun 2, 2020 at 10:41am PDT -
సుమీత్కు స్వర్ణం
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్ క్రీడల్లో చివరిరోజు బుధవారం టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణం, రజతం లభించాయి. భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, విజయ్ సుందర్ ప్రశాంత్‌ల మధ్య జరిగిన ఫైనల్లో సుమీత్ 6–1, 6–1తో నెగ్గి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. చెస్‌లో శశికిరణ్–సూర్యశేఖర గంగూలీ ద్వయం పురుషుల బ్లిట్జ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం, అండర్–23 విభాగంలో వైభవ్ సూరి–దీప్తాయన్ జంట కాంస్యం గెలిచాయి. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 40 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. -
సిక్కి, సుమీత్ జోడీల ఓటమి
న్యూఢిల్లీ: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. బరిలో నిలిచిన సుమీత్ రెడ్డి–మనూ అత్రి; సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. కెనడాలోని కాల్గరీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 15–21తో కిమ్ వన్ హో–సెయుంగ్ జే సియో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 17–21, 22–20, 18–21తో కిమ్ వన్ హో–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.