న్యూఢిల్లీ: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. బరిలో నిలిచిన సుమీత్ రెడ్డి–మనూ అత్రి; సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. కెనడాలోని కాల్‌గరీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 15–21తో కిమ్ వన్ హో–సెయుంగ్ జే సియో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 17–21, 22–20, 18–21తో కిమ్ వన్ హో–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.