jodi
-
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
అసలు సంగతి ఏంటి?
‘అస్సలు ఈ టైమ్‌లో ఇంత హైట్‌లో కూర్చుని బీరు కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది’ అంటూ ఆది సాయికుమార్ డైలాగ్‌తో విడుదలైన ‘జోడి’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జోడి’. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో భావన క్రియేషన్స్ పతాకంపై శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేమ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆది, శ్రద్ధల మధ్య అందమైన ప్రేమకథతో పాటు వీకే నరేష్ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆది, శ్రద్ధ లుక్స్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అవుట్ డోర్ ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా ఉన్న మా చిత్రానికి ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న మా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. గొల్లపూడి మారుతీరావు, సత్య, ‘వెన్నెల’ కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణికళ్యాణ్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్. -
ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’
ఆది సాయి కుమార్ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేస్ మరోసారి మంచి కామెడీతో పాటు బరువైన సెంటిమెంట్‌ను కూడా పండించారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కొత్తగా ఉన్నావు అంటున్నారు
‘‘నేను ఓ రియలిస్టిక్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న టైమ్‌లో విశ్వనాథ్ ఈ కథ గురించి చెప్పాడు. చాలా బాగుంది. మిమ్మల్ని ఈ సినిమాతో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా అనే నమ్మకముంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో విజయలక్ష్మీ నిర్మించారు. విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆమె చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ చిత్రం టీజర్ రిలీజయ్యాక అందరూ ఫోన్ చేసి ‘నువ్వు చాలా కొత్తగా ఉన్నావు’ అని అభినందించారు’’ అన్నారు. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో మొదౖలై ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నిర్మాత విజయలక్ష్మీ ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది అంటే, హీరో అది ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు. హీరోయిన్ శ్రద్ధా కథ వినగానే చేస్తున్నా అన్నారు. నరేశ్‌గారికి పాత్ర చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు ఫణికుమార్, నేను కొత్త ట్యూన్స్ కోసం ప్రయత్నించాం’ అన్నారు. శ్రద్ధా మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను మరచిపోలేను. ‘జోడి’ కథ వింటూ చాలాసార్లు నవ్వుకున్నాను’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలు మోహమాటంతో, కొన్ని సినిమాలు ఆ సినిమా స్పాన్ చూసి చేస్తాం. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో న చ్చి చేశాను’’ అన్నారు. ‘‘నేచురల్‌గా ఉండే సినిమా చేద్దాం అనుకున్నాను. విశ్వనాథ్ ఈ కథ చెప్పగానే ఆదిగారు కరెక్ట్ అనిపించి ఆయనకు చెప్పాం. కథ వినగానే ఆది ఓకే అన్నారు. శ్రద్ధా మా సినిమాకు ఎస్సెట్ అవుతుంది’’ అన్నారు విజయలక్షి. -
సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల
బుర్రకథ సినిమాతో రీసెంట్గా ఆడియెన్స్‌ను పలకరించిన ఆది సాయికుమార్‌కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్‌క్రియేట్ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇటీవలె టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
జోడీ కుదిరింది
‘ప్రేమ కావాలి, లవ్లీ’ వంటి ప్రేమకథా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్. లేటేస్ట్‌గా మరో లవ్‌స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’లో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. పద్మజ, సాయి వెంకటేశ్ గుర్రం నిర్మాతలు. ఉగాది సందర్భంగా ‘జోడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘హీరో, హీరోయిన్ జోడీ మధ్య జరిగే ప్రేమకథ, వాళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్, కెమెరా: విశ్వేశ్వర్. -
సిక్కి, సుమీత్ జోడీల ఓటమి
న్యూఢిల్లీ: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. బరిలో నిలిచిన సుమీత్ రెడ్డి–మనూ అత్రి; సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. కెనడాలోని కాల్గరీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 15–21తో కిమ్ వన్ హో–సెయుంగ్ జే సియో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 17–21, 22–20, 18–21తో కిమ్ వన్ హో–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
అందం కోసం హింసించుకుంటున్నా : త్రిష
‘జోడీ’ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్స్‌లో ఓ ఫ్రెండ్‌గా కనిపిస్తారు త్రిష. ఆ సినిమా వచ్చి పధ్నాలుగేళ్లు అయ్యింది. అంటే... త్రిషది 14ఏళ్ల సినీ కెరీర్ అన్నమాట. ఇంతటి సుదీర్ఘమైన నట ప్రస్థానం ఉన్న కథానాయిక ప్రస్తుతం త్రిష ఒక్కరే అని చెప్పాలి. ఈ ఏడాదితో ఈ చెన్నయ్ చందమామకు 30 ఏళ్లు నిండాయి కూడా. కానీ ఇంకా ప్రేమకథల్లో నటించగలిగేంత గ్లామరస్‌గా ఉన్నారు త్రిష. టీనేజర్లను సైతం తలదన్నే ఒంపుసొంపులతో నాజూగ్గా కనిపిస్తారామె. త్రిషలో మరో ఆకర్షణ చామనఛాయలో ఉండే ఆమె కలర్, దాంతో పాటు అందమైన ఆ నవ్వు... ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఇంత గ్లామరస్‌గా ఎలా ఉండగలుతున్నారు? అని ఇటీవల త్రిషను అడిగితే ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నా తోటి కథానాయికలతో పోల్చి చూస్తే నాది పెక్యులర్ బాడీ. ఇలాంటి ఆకృతినిచ్చిన నా అమ్మానాన్నలకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక నటి శరీరాకృతి ఎలా ఉండాలో... నా ఆకృతి అలా ఉంటుంది. అన్ని రకాల పాత్రలకూ నా శరీరం సూటవుతుంది. ఒక బిగ్‌షాట్ కూతురు పాత్ర అనుకోండీ... నాతో పాటు అందరు కథానాయికల్నీ ప్రేక్షకులు ఒప్పుకుంటారు. అయితే... ఒక రిక్షాపుల్లర్ కూతురు పాత్ర అనుకోండీ... మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకే ఎక్కువ మార్కులేస్తారు. అంటే... అటు గొప్పింటి అమ్మాయిగా కనిపించగలనూ ఇటు పేదింటి అమ్మాయిగా మెప్పించగలను. అలాగే... బుక్స్ పట్టుకొని కాలేజ్‌కి వెళ్లగలను, కాటన్శారీ కట్టుకొని లెక్చరర్‌గా కనిపించగలను. మోర్ గ్లామరస్‌గానూ నటించగలను, డీగ్లామరస్ పాత్రలతో ఒప్పించగలను. నా బాడీ తీరు అలాంటిది. అందుకే... దేవుడిచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి గ్లామరస్ పాత్రలకంటే... నటనకు అవకాశం ఉన్న పాత్రలకే పెద్ద పీట వేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ఇంకా చెబుతూ- ‘‘మీ అందరికీ నా గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని కోసం నేను పడే కష్టం గురించి ఎవరికీ తెలీదు. నా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి నా శరీరాన్ని నేను ఓ స్థాయిలో హింసించుకుంటాను. నేను చేసే వ్యాయామాలు చాలా కఠినమైనవి. అయితే.. ఆ బాధ కూడా ఇష్టంగా అనుభవిస్తాన్నేను. నా అందానికి కారణం అదే’’ అని చెప్పుకొచ్చారు త్రిష.