
‘ప్రేమ కావాలి, లవ్లీ’ వంటి ప్రేమకథా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్. లేటేస్ట్‌గా మరో లవ్‌స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’లో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. పద్మజ, సాయి వెంకటేశ్ గుర్రం నిర్మాతలు. ఉగాది సందర్భంగా ‘జోడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘హీరో, హీరోయిన్ జోడీ మధ్య జరిగే ప్రేమకథ, వాళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్, కెమెరా: విశ్వేశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment