నార్మల్‌ డెలివరీ.. అందుకే ఆ పేరు: నటుడు | Sumeet Vyas Reveal Why They Named Their Son Ved | Sakshi
Sakshi News home page

ఏక్తాకు నార్మల్‌ డెలివరీ.. బాబు పేరు వేద్‌: నటుడు

Published Fri, Jun 5 2020 9:09 PM | Last Updated on Fri, Jun 5 2020 9:30 PM

Sumeet Vyas Reveal Why They Named Their Son Ved - Sakshi

తమ వంశ వృక్షాన్ని అనుసరించి తన కుమారుడికి వేద్‌ అని నామకరణం చేసినట్లు బాలీవుడ్‌ నటుడు సుమీత్‌ వ్యాస్‌ వెల్లడించాడు. వేద వ్యాసుడి అంశ నుంచి వచ్చిన వాళ్లం గనుక తన చిన్నారికి ఈ పేరు పెట్టడం సరైందేనని భావిస్తున్నానన్నాడు. కాగా బీ- టౌన్‌ సెలబ్రిటీ జంట సుమీత్‌ వ్యాస్‌, ఏక్తా కౌల్‌ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై మిర్రర్‌తో సుమీత్‌ వ్యాస్‌ మాట్లాడుతూ ఏక్తాకు నార్మల్‌ డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు.

‘‘చాలా ఏళ్ల క్రితం మా బంధువుల్లో ఒకరికి కొడుకు పుట్టినపుడు తనకి ఏం పేరు పెట్టాలా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాం. అప్పుడు నాకు వేద్‌ అనే పేరు తట్టింది. అయితే మిగతావాళ్లు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. అందుకే నాకు భవిష్యత్తులో కొడుకు పుడితే వాడికి ఈ పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా. నిజానికి మా వంశ వృక్ష మూలపురుషుడైన వేదవ్యాసుడి పేరును ప్రతిబింబించే ఈ పేరంటే నాకెంతో ఇష్టం. ఆ అంశలో మేమున్నాం కాబట్టి.. వేద్‌వ్యాస్‌ అనే పేరు నా కొడుక్కి సరిగ్గా సరిపోతుందనుకున్నా’’అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.(న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం నుంచి బెదిరింపులు)

ఇక లాక్‌డౌన్‌ కారణంగా తన తల్లిదండ్రులు, అత్తమామలు ముంబైకి వచ్చి వేద్‌ను చూసే పరిస్థితి లేదని.. ఏదేమైనా ఏక్తా, వేద్‌ ఆరోగ్యంగా ఉండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. కాగా డెలివరీకి ముందు ఏక్తా.. ‘పప్పా థాంక్యూ’ అంటూ సుమీత్‌తో తనకున్న అందమైన జ్ఞాప​కాలను ప్రతిబింబించే ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కాగా సుమీత్‌ వ్యాస్‌, ఏక్తా కౌల్‌ 2018లో జమ్మూలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement