Ekta
-
ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్ కొట్టిన యువతి
ట్విటర్(ఎక్స్.కామ్)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్ కొట్టేసింది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో సదరు యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్ ట్రూ కాలర్ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి. People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK — Alan Mamedi (@AlanMamedi) August 3, 2023 -
నార్మల్ డెలివరీ.. అందుకే ఆ పేరు: నటుడు
తమ వంశ వృక్షాన్ని అనుసరించి తన కుమారుడికి వేద్ అని నామకరణం చేసినట్లు బాలీవుడ్ నటుడు సుమీత్ వ్యాస్ వెల్లడించాడు. వేద వ్యాసుడి అంశ నుంచి వచ్చిన వాళ్లం గనుక తన చిన్నారికి ఈ పేరు పెట్టడం సరైందేనని భావిస్తున్నానన్నాడు. కాగా బీ- టౌన్ సెలబ్రిటీ జంట సుమీత్ వ్యాస్, ఏక్తా కౌల్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై మిర్రర్‌తో సుమీత్ వ్యాస్ మాట్లాడుతూ ఏక్తాకు నార్మల్ డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. ‘‘చాలా ఏళ్ల క్రితం మా బంధువుల్లో ఒకరికి కొడుకు పుట్టినపుడు తనకి ఏం పేరు పెట్టాలా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాం. అప్పుడు నాకు వేద్ అనే పేరు తట్టింది. అయితే మిగతావాళ్లు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. అందుకే నాకు భవిష్యత్తులో కొడుకు పుడితే వాడికి ఈ పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా. నిజానికి మా వంశ వృక్ష మూలపురుషుడైన వేదవ్యాసుడి పేరును ప్రతిబింబించే ఈ పేరంటే నాకెంతో ఇష్టం. ఆ అంశలో మేమున్నాం కాబట్టి.. వేద్వ్యాస్ అనే పేరు నా కొడుక్కి సరిగ్గా సరిపోతుందనుకున్నా’’అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.(నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం నుంచి బెదిరింపులు) ఇక లాక్డౌన్ కారణంగా తన తల్లిదండ్రులు, అత్తమామలు ముంబైకి వచ్చి వేద్‌ను చూసే పరిస్థితి లేదని.. ఏదేమైనా ఏక్తా, వేద్ ఆరోగ్యంగా ఉండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. కాగా డెలివరీకి ముందు ఏక్తా.. ‘పప్పా థాంక్యూ’ అంటూ సుమీత్‌తో తనకున్న అందమైన జ్ఞాపకాలను ప్రతిబింబించే ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా సుమీత్ వ్యాస్, ఏక్తా కౌల్ 2018లో జమ్మూలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. View this post on Instagram Our world is about to change. But my life has changed because of you. I am so thankful that we get to go on this ride together. So before all the screaming and diaper changing begins, I just want to say PAPA you are beautiful. Thank you !! @sumeetvyas A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on Jun 2, 2020 at 10:41am PDT -
శుభవార్త చెప్పిన స్టార్ జంట
‘‘మేమిద్దరం కలిసి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. త్వరలోనే జూనియర్ కౌల్వ్యాస్ను పరిచయం చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు సృష్టికర్త, డైరెక్టర్లు, నిర్మాతలు సుమీత్ వ్యాస్, నేను’’అంటూ మోడల్, టీవీ నటి ఏక్తా కౌల్ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ క్రమంలో తన భర్త, నటుడు సుమిత్ వ్యాస్ తనను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను జతచేశారు. దీంతో ఈ స్టార్ జంటకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఏక్తా పలు టీవీ సీరియళ్లలో కథానాయికగా నటించి బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు, రచయిత సుమీత్ వ్యాస్‌ను ప్రేమించారు. 2018లో వీరిద్దరు కశ్మీరీ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఏక్తా తరచుగా తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆమె భర్తతో కలిసి ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే విధంగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ అభిమానుల్లో చైతన్యం నింపుతున్నారు. View this post on Instagram Proudly announcing our new project together. 👶🏻👶🏻 Introducing Jr. KaulVyas (soon) Created, Directed and Produced by US.... @sumeetvyas and I 🙏🏻🙏🏻 A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on Apr 4, 2020 at 10:19pm PDT -
రొమాంటిక్ థ్రిల్లర్
దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, బి.జయ, రమేష్, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్ వంటి వారి వద్ద మాటల రచయితగా, సహాయ దర్శకుడిగా చేసిన సుమన్‌రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రాబిన్ సోహి, నవనీత్ కౌర్ థిల్లాన్ జంటగా తెలుగు, హిందీ భాషల్లో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఏక్త’. విరాట్ సినిమాస్ సమర్పణలో బీఎస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. మొదటి షెడ్యూల్ కేరళ, అలెప్పీలో జరిపాం. ఈ నెలలో రెండో షెడ్యూల్ ప్రారంభించి, షూటింగ్ పూర్తి చేస్తాం. డిసెంబర్లో విడుదల చేస్తాం. ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ ఓ పాట పాడటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తమశ్యామ్, సంగీతం: దబు మాలిక్.