రొమాంటిక్ థ్రిల్లర్ | debute director suman reddy making movie ektha | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ థ్రిల్లర్

Published Sun, Oct 9 2016 11:34 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

రొమాంటిక్ థ్రిల్లర్ - Sakshi

రొమాంటిక్ థ్రిల్లర్

దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, బి.జయ, రమేష్, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్ వంటి వారి వద్ద మాటల రచయితగా, సహాయ దర్శకుడిగా చేసిన సుమన్‌రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రాబిన్ సోహి, నవనీత్ కౌర్ థిల్లాన్ జంటగా తెలుగు, హిందీ భాషల్లో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఏక్త’. విరాట్ సినిమాస్ సమర్పణలో బీఎస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది.
 
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. మొదటి షెడ్యూల్ కేరళ, అలెప్పీలో జరిపాం. ఈ నెలలో రెండో షెడ్యూల్ ప్రారంభించి, షూటింగ్ పూర్తి చేస్తాం. డిసెంబర్‌లో విడుదల చేస్తాం. ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ ఓ పాట పాడటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తమశ్యామ్, సంగీతం: దబు మాలిక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement