Indian Girl Ekta Gets Job Offer From Truecaller Ceo After Trolling, Check Her Viral Video Inside - Sakshi
Sakshi News home page

Indian Girl Ekta Viral Video: ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్‌ కొట్టిన యువతి

Published Fri, Aug 4 2023 12:51 PM | Last Updated on Fri, Aug 4 2023 1:35 PM

Indian Girl Ekta Gets Job Offer From Truecaller Ceo After Trolling - Sakshi

ట్విటర్‌(ఎక్స్‌.కామ్‌)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్‌ కొట్టేసింది. ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్‌ సీఈవో అలాన్ మామెడి  

భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్‌ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  

అందులో సదరు యూట్యూబర్‌ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్‌ చేయడం ప్రారంభించారు. 

అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్‌ కాలర్‌ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్‌ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్‌ ఆఫర్‌ ఇచ్చారు.  

‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్‌ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్‌ ట్రూ కాలర్‌ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని  పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇం​కెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement