Alan Mamedi
-
అప్పుడు నారాయణమూర్తి ఇలా సమాధానమిచ్చారు - ట్రూకాలర్ సీఈఓ
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తిని ఎనిమిదేళ్ల క్రితం కలిసినట్లు, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. ట్రూకాలర్ సీఈఓ 'అలాన్ మామెడి' ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటిసారి నారాయణ మూర్తిని కలిసినప్పుడు అతడెవరో తనకు తెలియదని, నేనెవరో ఆయనకు తెలియదని వెల్లడించాడు. వారివురు మాట్లాడుకునే సమయంలో మీరు ఏమి చేస్తారని అడిగానని అలాన్ చెప్పాడు. దీనికి సమాధానంగా 'జీవితంలో నాకు అదృష్టం ఉండటం వల్ల ప్రజలకు తప్పకుండా కొంత సాయం చేయాలని నా భార్య ఎప్పుడూ నాతో చెబుతుంది, అదే చేస్తున్న అని చెప్పాడని ట్వీట్లో వెల్లడించాడు. వందలకోట్ల సంపద ఉన్నప్పటికీ నారాయణ మూర్తి చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని అలాన్ మామెడి వెల్లడించాడు. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ నిజానికి నేను (అలాన్ మామెడి) చదువుకునే రోజుల్లో మా ఇంట్లో కంప్యూటర్ బాగుచేయడానికి ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చాడని.. అప్పుడే ఆ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్నట్లు వివరించాడు. కానీ జీవితం ఎలా ముందుకు సాగుతుందో తెలియదని ఇందులో ప్రస్తావించాడు. First time I met Narayana was almost 8 yrs ago. I did not know who he was and he didn't know what I did. After an inspiring hour of discussing everything about life, I asked him what he do and he said "My wife always told me that because I had luck in life, I must give back, and… https://t.co/7dVJupNmqI pic.twitter.com/KGljiEvW59 — Alan Mamedi (@AlanMamedi) November 3, 2023 -
ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్ కొట్టిన యువతి
ట్విటర్(ఎక్స్.కామ్)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్ కొట్టేసింది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో సదరు యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్ ట్రూ కాలర్ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి. People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK — Alan Mamedi (@AlanMamedi) August 3, 2023