True Caller
-
కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
మోసపూరిత కాల్స్‌ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్‌ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్‌కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలుకాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అంతర్జాతీయ కాల్స్‌కు ఇలా..సీఎన్ఏపీ సర్వీస్‌తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.సవాళ్లున్నా అమలుకు సిద్ధంసీఎన్ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్లో ప్రారంభమమై మరొక సర్కిల్లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు -
వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం
ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఏదైనా కాల్ వస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొబైల్లో డిస్ప్లే అవ్వడానికి ట్రూకాలర్ వినియోగిస్తుంటారు. తన వినియోగదారులకు మరింత సేవలందించేందుకు ట్రూకాలర్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ మాదిరిగానే ‘ట్రూకాలర్ వెబ్’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్ నంబర్‌ను డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎస్ఎంఎస్, ఛాట్ మిర్రరింగ్, కాల్నోటిఫికేషన్ ఫీచర్లు కూడా వెబ్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకసారి లింక్ చేసిన డివైజ్ డీలింక్ చేయకపోతే 30 రోజుల్లో ఆటోమెటిక్‌గా సైన్అవుట్ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోదారులకే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే.. ఎలా కనెక్ట్ చేయాలంటే.. డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ లాగే ట్రూకాలర్వెబ్ అని టైప్‌చేయాలి. లింక్డిబైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటన్ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఏ మొబైల్ తరఫున లాగిన్ చేయాలో ఆ ఫోన్ ఆన్‌చేసి ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మెసేజెస్ విభాగంలో త్రిడాట్ మెను ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో ‘ట్రూకాలర్ ఫర్ వెబ్’పై ప్రెస్ చేయాలి. లింక్ డివైజ్ అనే అప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా డెస్క్టాప్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. క్షణాల్లో ఫోన్ యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌తో లింక్ అవుతుంది. -
ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్ కొట్టిన యువతి
ట్విటర్(ఎక్స్.కామ్)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్ కొట్టేసింది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో సదరు యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్ ట్రూ కాలర్ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి. People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK — Alan Mamedi (@AlanMamedi) August 3, 2023 -
మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్!
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్ఏపీ అమల్లోకి వస్తే కాల్ చేసే వారి పేరు మొబైల్ ఫోన్లలో డిస్ప్లే అవుతుంది. తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ స్పామ్ వంటి యాప్‌లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్‌లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. చదవండి: డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! -
తెలియక ఈ తప్పులు చేశారో..బుక్కైపోతారు! బీ కేర్‌ఫుల్!!
ఒకప్పుడు తెలిసిన వారికే డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చేది. కానీ, నేడు చెల్లింపులన్నీ డిజిటల్ అయ్యాయి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. కూరగాయల దగ్గర్నుంచి ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. సినిమా, రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటళ్లలో బుకింగ్‌లు.. ఈ జాబితా చాలా పెద్దదే. కానీ, ఆన్లైన్ చెల్లింపుల్లో (యూపీఐ, ఇతరత్రా) ఎంత సౌకర్యం ఉందో, అంతకంటే ఎక్కువే రిస్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన, జాగ్రత్తలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి మోసపోతే కనుక దొంగ దొరికి, పోయిన మొత్తం వెనక్కి రావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను వివరించేదే ఈ కథనం. ►తెలియని వ్యక్తులతో లావాదేవీలు వద్దు ►తెలియని సంస్థలతోనూ ఇదే పాటించాలి ►యూపీఐకి బదులు , నెఫ్ట్, ఐఎంపీఎస్ మేలు ►ట్రూకాలర్ సాయం తీసుకోవచ్చు ►సామాజిక మాధ్యమాల తోడ్పాటు కూడా తీసుకోవాలి... ► పూర్తి నిర్ధారణ తర్వాతే చెల్లింపు అదేపనిగా కాల్స్ చేస్తే.. మోసగాళ్లు అయితే కాల్స్, మెస్సేజ్‌ల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. ఒకటికి నాలుగు సార్లు కాల్ చేయడం, ఎస్ఎంఎస్లు పంపిస్తుంటే ముందుగా అనుమానించాలి. వారితో మాట్లాడినప్పుడు ఈ ఆఫర్/అవకాశం మళ్లీ ఉండదని/రాదని చెప్పడం, వారి మాటల్లో ఏకరూపత లేకపోతే స్కామ్గానే సందేహించాలి. అలాగే, వాట్సాప్ చేస్తున్నా ఇలాగే అనుమానించాలి. కొందరు నేరస్థులు ఏ మాత్రం అనుమానం కలగనీయని రీతిలో సంప్రదింపులు చేస్తుంటారు. అటువంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కోరాలి. హోటల్ బుకింగ్ అయితే నేరుగా వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పాలి. మొదటగా తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫలానా ఆఫర్ అనో, ప్యాకేజీ అనో, లాటరీ వచ్చిందనో చెప్పే మాటలకు మెతకగా స్పందించడం, ఆసక్తి చూపడం, అయోమయంగా అనిపించేలా వ్యవహరించకండి. అవతలి వ్యక్తి మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని నంబర్, మెయిల్ ఐడీ నుంచి ఏదైనా ఆఫర్లు, సందేశాలు వస్తే, లింక్‌లు వస్తే వాటిని తెరవడం, అందులోని నంబర్లను సంప్రదించడం చేయవద్దు. పేరున్న సంస్థలు అయితే నేరుగా వాటి సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. అంతేకానీ, మొబైల్‌కు తెలియని మూలాల నుంచి ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే వెబ్‌లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాల్ చేసి, తమది ఫలానా ఎన్జీవో, చిన్న పిల్లల ఆరోగ్య అవసరాల కోసం విరాళాలు సమీకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇలాంటివి అసలు నమ్మనే వద్దు. ఎవరికైనా సాయం చేయాలంటే ప్రత్యక్షంగా చేయడమే మంచిది. అవసరం లేని ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం... రిస్క్‌ను ఆహ్వానించడమే. యూపీఐ వద్దు.. యూపీఐ చెల్లింపులకు బదులు నెఫ్ట్/ఐఎంపీఎస్ నగదు బదిలీ మార్గాలను అనుసరించడం కొంచెం సురక్షితమైనది. యూపీఐ సాధనం సురక్షితమైనదే. కానీ, సరైన వ్యక్తికి పంపినప్పుడే. నగదు స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు ఇందులో తెలియవు. అదే నెఫ్ట్/ఐఎంపీఎస్‌లో డబ్బు పంపాలంటే పూర్తి వివరాలు కావాల్సిందే. అందుకే అవతలి వ్యక్తి మాటలు నమ్మదగినవిగా అనిపించకపోతే, సందేహం వస్తే ఖాతా వివరాలు ఇవ్వాలని కోరాలి. కంగారు పడొద్దు... పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటే వేగం ప్రదర్శించొద్దు. సమయం తీసుకోండి. తొందరపడితే ప్రాథమిక అంశాలను కూడా విస్మరిస్తుంటాం. తొందరపడి మోస పోయినట్టుగా ఉంటుంది. అది నిజమా, మోసమా అని గుర్తించేందుకు వ్యవధి ఇవ్వాలి. అవతలి వ్యక్తితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడాలి. కొన్ని రోజులు ఆగి చూడాలి. అప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఆధారంగా నిజా, నిజాలను గుర్తించే వెసులుబాటు ఉంటుంది. ముందే మొత్తం వద్దు.. ఇక నగదు పంపించేందుకు సిద్ధమైతే కనుక మొత్తం ఒకేసారి చెల్లించేయవద్దు. సాధారణంగా నమ్మకం ఏర్పడినప్పుడు ఎక్కువమంది ఒకే విడత డిస్కౌంట్ కోరి చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాయిదాలుగా చెల్లించడం అందరికీ నచ్చదు. ఆన్లైన్ మోసాలను నివారించాలంటే.. ఒకేసారి మొత్తం పంపకుండా ఉండడమే మంచి మార్గం. దీనివల్ల మోసం అయితే కొద్ది మొత్తంతోనే ఆగిపోతుంది. గూగుల్ సెర్చ్.. డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్, ఈమెయిల్‌ను ఆన్లైన్లో ఓసారి సెర్చ్ చేయాలి. అదే నంబర్, అదే ఈ మెయిల్ పేరిట అప్పటికే ఎవరైనా మోసపోయి ఉంటే, ఆ వివరాలు లభిస్తాయి. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే.. అదే నంబర్ పలు వ్యాపారాలకు సంబంధించి చూపించొచ్చు. గూగుల్‌లో ఒకటికి మించిన కంపెనీలకు ఆ నెంబర్ చూపిస్తే కచ్చితంగా మోసపూరితమైనదే. ట్రూకాలర్ అయితే, అన్ని ఫోన్ నంబర్ల వివరాలు గూగుల్‌లో కనిపించాలని లేదు కదా? మోసగాళ్లు ఒక్కో పెద్ద మోసానికి ఒక్కో ఫోన్ నంబర్ వాడుతున్న రోజులు ఇవి. కనుక గూగుల్‌లో వివరాలు లభించకపోతే అప్పుడు ఫోన్లో ట్రూకాలర్ యాప్ వేసుకుని అందులో సెర్చ్ చేయడమే మార్గం. సదరు నెంబర్‌తో ఎవరైనా మోసపోయి ఉంటే.. ఫ్రాడ్, స్కామ్, స్పామ్‌గా చూపిస్తుంది. కచ్చితంగా దాన్ని ఒక సంకేతంగానే చూడాలి. పూర్తి పేరుతో వస్తే అప్పుడు తదుపరి పరిశీలనకు వెళ్లాలి. తెలియని పోర్టళ్లు.. తెలియని సంస్థల సేవలకు దూరంగా ఉండడమే భద్రతా పరంగా మంచి విధానం అవుతుంది. ఉదాహరణకు మూవీ టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే బుక్‌మైషో, పేటీఎం ఇలాంటివి అందరికీ తెలుసు. ఇవి నిజమైన వ్యాపార వేదికలు. కానీ, ఎప్పుడూ వినని వెబ్సైట్ లేదా యాప్‌లో ఒకటి కొంటే ఒకటి ఉచితానికి ఆశపడొద్దు. ఉచితమేమో కానీ, మన కార్డు వివరాలు, ఇతర కీలక సమాచారం పక్కదారి పట్టొచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాలన్స్‌ను కొట్టేయవచ్చు. వేరే వారికి స్టీరింగ్ టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దు. చేశారంటే మీ స్క్రీన్‌ను వారితో షేర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మీ తరఫున అవతలి వ్యక్తి లావాదేవీలు నిర్వహిస్తాడు. ఫోన్, కంప్యూటర్లోని సమాచారం మొత్తాన్ని కొట్టేస్తారు. ఇటీవలే గచ్చిబౌలిలో పనిచేసే 28 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఒక కాల్ వచ్చింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్రెడిట్ కార్డుకు ఇచ్చిన చిరునామా వివరాల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపాడు. ఇందుకోసం ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫోన్ చేసింది బ్యాంకు ఉద్యోగేనని నమ్మి, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాడు. అదే సమయంలో క్రెడిట్ కార్డు నుంచి రూ.52,000 డెబిట్ అయినట్టు సందేశం వచ్చింది. ఇంకేముంది కాల్ కట్. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆత్మ పరిశీలన ముందు చెప్పుకున్నట్టు కొంత సమయం తీసుకుని, మనలో మనమే ఓ సారి అన్ని అంశాలను బేరీజు వేసుకుని, కచ్చితత్వాన్ని రూఢీ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా ఉందని అనిపిస్తే.. ఇక ఆ డీల్‌కు అంతటితో ముగింపు పలకాలి. -
ట్రాయ్ కాలర్ ఐడీతో మాకు పోటీనా.. ఛాన్సేలేదు..
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన కేవైసీ ఆధారిత కాలర్ నేమ్ డిస్ప్లే విధానంతో తమకు పోటీ ఉండబోదని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ సీఈవో అలాన్ మామెడీ తెలిపారు. తాము కేవలం కాలర్ గుర్తింపు సేవలే అందించడానికి పరిమితం కాకుండా తమ టెక్నాలజీ, డేటాతో మరెన్నో సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్స్‌ను సురక్షితమైనవిగా చేసే దిశగా ట్రాయ్ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని అలాన్ వివరించారు. ఒకవేళ ప్రతిపాదిత సర్వీసును ప్రవేశపెడితే, దాన్ని అభివృద్ధి చేసేందుకు, అమల్లోకి తెచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన టెలికం ఆపరేటర్లందరి సహకారం దీనికి అవసరమవుతుందని ఒక ప్రకటనలో వివరించారు. ట్రాయ్ కసరత్తు కనెక్షన్ తీసుకునే సమయంలో కస్టమరు ఇచ్చే వివరాల (కేవైసీ)ను ప్రాతిపదికగా తీసుకుని, కాల్ చేసేటప్పుడు సదరు యూజరు పేరు అవతలి వారి ఫోన్లో డిస్ప్లే అయ్యేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టడంపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. త్వరలో పరిశ్రమ వర్గాలతో దీనిపై చర్చలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ట్రూకాలర్ ఇదే తరహా సేవలు అందిస్తోంది. భారత్‌లో భారీ స్థాయిలో యూజర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ప్రతిపాదన .. ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసుల సంస్థలకు ప్రతికూలం కాగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: మొబైల్ వినియోగదారులకు భారీ షాక్! -
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది. ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు. -
భారత్‌లో రెట్టింపైన స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: మనకు అవసరం లేకపోయినా, మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ చేసి విసిగించడమే స్పామ్ కాల్స్ కాగా... ఈ తరహా కాల్స్ బారిన పడిన దేశాల్లో భారత్ ఏకంగా రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది యూజర్లకు విసుగు తెప్పించే కాల్స్‌ను అందుకున్న దేశాల జాబితాలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తరువాతి స్థానంలో భారత్ ఉన్నట్లు యాప్ నిర్వహణ సంస్థ ట్రూ కాలర్ వెల్లడించింది. గత కొంతకాలంగా భారత్‌లో స్పామ్ కాల్స్ రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయని, మొత్తం ఫోన్ కాల్స్‌లో 3 శాతంగా ఉన్న ఈ కాల్స్.. ఈ ఏడాదిలో 7 శాతానికి పెరిగాయని నివేదికలో తెలియజేసింది. 2018లో స్పామ్ కాల్స్‌లో 6.1% పెరుగుదల చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే వ్యక్తిగత స్పామ్ కాల్స్ ఈ ఏడాదిలో 1.5% తగ్గాయని వెల్లడించింది. 91 శాతం కంపెనీలవే.. భారత్‌లోని స్పామ్ కాల్స్‌లో 91 శాతం టెలికం సర్వీసు ప్రొవైడర్లు, ఆపరేటర్ల నుంచి వస్తున్నవే. వివిధ ఆఫర్లు, బ్యాలెన్స్ రిమైండర్లకు చెందిన కాల్స్ చేస్తూ ఈ సంస్థలు విసిగిస్తున్నట్లు పేర్కొంది. స్కామ్ కాలర్ల వాటా 7 శాతంలో టెలీ మార్కెటర్ల కాల్స్ 2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. -
ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్
న్యూఢిల్లీ: ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. ఈ యాప్‌లో పెట్టుబడి కారణంగా ట్రూకాలర్ అడ్వైజరీ బోర్డ్‌లో ఒక సభ్యుడిగా అరుణ్ శరీన్ చేరుతారని ట్రూకాలర్ తెలిపింది. టెలికాం పరిశ్రమలో పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ రంగంలో అపార అనుభవమున్న అరుణ్ శరీన్ తమ అడ్వైజరీ బోర్డ్‌లో ఒక సభ్యుడిగా చేరడం తమకు సంతోషదాయకమని ట్రూకాలర్ సీఈఓ అలన్ మమెడి చెప్పారు. ట్రూకాలర్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్. భారత్‌లో ఈ కంపెనీకి 10 కోట్ల మంది యూజర్లున్నారు.