ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్ | Former Vodafone CEO Arun Sarin picks up stake in Truecaller | Sakshi
Sakshi News home page

ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్

Published Fri, Jun 10 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్

ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్

న్యూఢిల్లీ: ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. ఈ యాప్‌లో పెట్టుబడి కారణంగా ట్రూకాలర్ అడ్వైజరీ బోర్డ్‌లో ఒక సభ్యుడిగా అరుణ్ శరీన్ చేరుతారని ట్రూకాలర్ తెలిపింది. టెలికాం పరిశ్రమలో పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ రంగంలో అపార అనుభవమున్న అరుణ్ శరీన్ తమ అడ్వైజరీ బోర్డ్లో ఒక సభ్యుడిగా చేరడం తమకు సంతోషదాయకమని ట్రూకాలర్ సీఈఓ అలన్ మమెడి చెప్పారు. ట్రూకాలర్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్. భారత్‌లో ఈ కంపెనీకి 10 కోట్ల మంది యూజర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement