phone app
-
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
మొబైల్ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్‌ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ అవసరానికైనా యాప్‌లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్నైనా ఉపయోగించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్‌ను ఎలాంటి యాప్‌లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్ డివైజ్‌లోని ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ వివరించింది. వినియోగదారులు వాయిస్ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను రూపొందించారు. నావిగేషన్, క్యాబ్, హోటల్ బుకింగ్.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్కామ్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్‌లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్‌లైన్ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? రానున్న రోజుల్లో మొబ్స్ళ్లలో ఎవరూ యాప్‌లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు. -
మీ బంగారం స్వచ్ఛమైనదేనా?నకిలీదా..మొబైల్ లోనే ఇలా చెక్ చేసుకోండి..
-
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్‌కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫీలింగ్.. ఫిర్యాదు
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు, అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్–ఐ’ యాప్ సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. ఆ యాప్‌లో ‘పోలీసుల తీరు’పై ప్రజాభిప్రాయానికి చోటుకల్పిస్తున్నారు. ఎక్కడన్నా పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రవర్తన సరిగా లేకున్నా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఇలా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు సైతం పూర్తి గోప్యంగా ఉండేలా రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ ‘ఫీడ్‌బ్యాడ్’ సదుపాయం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఫిర్యాదుదారులే కాకుండా ప్రతి ఒక్కరూ పోలీసులపై తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ‘హాక్– ఐ’ యాప్ ద్వారా ఇవ్వనుంది. దీని ద్వారా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీడ్‌బ్యాడ్ ఇచ్చే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఫిర్యాదుదారుల నుంచే.. అవినీతి నిరోధక, స్నేహపూర్వక పోలీసింగ్ విధానాలు చేపట్టిన హైదరాబాద్ పోలీసు విభాగం దాదాపు మూడేళ్ల క్రితమే ఫీడ్‌బ్యాక్ తీసుకునే ఏర్పాట్లు చేసింది. ఇది కేవలం ఫిర్యాదుదారులకే పరిమితమైంది. తమ సమస్యలు, సహాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చే వారు తామిచ్చే ఫిర్యాదులో వ్యక్తిగత వివరాలతో పాటు సెల్‌ఫోన్ నెంబర్ సైతం పొందుపరుస్తారు. ఈ వివరాలు పోలీసుస్టేషన్ నుంచి ఆన్లైన్ ద్వారా కమిషనరేట్‌లోని థర్డ్‌పార్టీ కాల్ సెంటర్‌కు చేరతాయి. ఇక్కడి సిబ్బంది ఈ డేటాబేస్ నుంచి కొన్ని ఫోన్ నెంబర్లను ఎంపిక చేసుకుని వారికి ఫోన్ చేస్తుంటారు. ఆశ్రయించిన పోలీసుల స్పందన, తీరుతెన్నులు తదితరాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దీని ఆధారం ఆయా పోలీసుస్టేషన్లకు గ్రేడింగ్స్, అధికారుల పనితీరుకు మార్కులు సైతం ఇచ్చే ఏర్పాటు చేశారు. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే వారిపై విచారణ జరిపి చర్యలూ తీసుకుంటున్నారు. కనీసం రెండు శాతానికీచేరట్లేదని.. ఈ విధానం సిటీలో మంచి ఫలితాలను ఇచ్చింది. అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రకంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్న వారి శాతం జనాభాలో రెండు శాతం కూడా ఉండట్లేదని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే ఇక్కడ జనాభా కోటిగా భావిస్తే.. మూడు కమిషనరేట్లలోనూ కలిపి గరిష్టంగా లక్ష దాటట్లేదు. దీంతో అనేక మంది పోలీసులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చాలనే కృతనిశ్చయంతో పోలీసు అధికారిక యాప్ హాక్– ఐ యాప్‌ను వినియోగించుకోవాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు. ‘బ్యాడ్’ అయితేనేసంప్రదించేలా.. ఈ యాప్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కోసం ఓ లింకు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న వారు ఎవరైనా ఈ లింక్ ఓపెన్ చేయడం ద్వారా పోలీసుల ద్వారా తమకు ఎదురైన అనుభవం, తాము గమనించిన నెగెటివ్ అంశం తదితరాలను పొందుపరచవచ్చు. లింక్‌లో ఎక్స్లెంట్, గుడ్ తదితరాలతో పాటు బ్యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మిగిలిన ఆప్షన్ ఎంచుకుంటే కేవలం అది రికార్డు అవుతుంది. బ్యాడ్‌ను ఎంచుకుంటే మాత్రం ఓ ప్రత్యేక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ అభిప్రాయానికి కారణాన్ని సంక్షిప్తంగా రాసే అవకాశమూ ఉంటుంది. ఇలా చేసిన వారిని థర్డ్‌పార్టీ కాల్ సెంటర్ వారు సంప్రదిస్తారు. ఆ నెగెటివ్ అభిప్రాయానికి కారణం తెలుసుకుని, విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని తిరిగి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వారికీ వివరిస్తారు. ఈ విధానంలో ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
ట్రూకాలర్ లో వాటా కొన్న వొడాఫోన్ అరుణ్ శరీన్
న్యూఢిల్లీ: ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. ఈ యాప్‌లో పెట్టుబడి కారణంగా ట్రూకాలర్ అడ్వైజరీ బోర్డ్‌లో ఒక సభ్యుడిగా అరుణ్ శరీన్ చేరుతారని ట్రూకాలర్ తెలిపింది. టెలికాం పరిశ్రమలో పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ రంగంలో అపార అనుభవమున్న అరుణ్ శరీన్ తమ అడ్వైజరీ బోర్డ్‌లో ఒక సభ్యుడిగా చేరడం తమకు సంతోషదాయకమని ట్రూకాలర్ సీఈఓ అలన్ మమెడి చెప్పారు. ట్రూకాలర్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్. భారత్‌లో ఈ కంపెనీకి 10 కోట్ల మంది యూజర్లున్నారు.