
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది.
భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది.
ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు.