మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్‌! | Trai Decision On Mandatory Caller Id Display All Smartphones To Check Spam, Fraud | Sakshi

మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్‌!

Published Thu, Dec 1 2022 3:03 PM | Last Updated on Thu, Dec 1 2022 3:47 PM

Trai Decision On Mandatory Caller Id Display All Smartphones To Check Spam, Fraud - Sakshi

న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్‌ ఐడెంటిటీ (సీఎన్‌ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్‌ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్‌ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్‌ఏపీ అమల్లోకి వస్తే కాల్‌ చేసే వారి పేరు మొబైల్‌ ఫోన్లలో డిస్‌ప్లే అవుతుంది.

తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్‌ కాలర్‌ ఐడీ అండ్‌ యాంటీ స్పామ్‌ వంటి యాప్‌లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్‌లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్‌ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్‌ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్‌ చర్చాపత్రాన్ని రూపొందించింది.

చదవండి: డిజిటల్‌ లోన్లపై అక్రమాలకు చెక్‌: కొత్త రూల్స్‌ నేటి నుంచే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement