న్యూఢిల్లీ: మనకు అవసరం లేకపోయినా, మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ చేసి విసిగించడమే స్పామ్ కాల్స్ కాగా... ఈ తరహా కాల్స్ బారిన పడిన దేశాల్లో భారత్ ఏకంగా రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది యూజర్లకు విసుగు తెప్పించే కాల్స్‌ను అందుకున్న దేశాల జాబితాలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తరువాతి స్థానంలో భారత్ ఉన్నట్లు యాప్ నిర్వహణ సంస్థ ట్రూ కాలర్ వెల్లడించింది. గత కొంతకాలంగా భారత్‌లో స్పామ్ కాల్స్ రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయని, మొత్తం ఫోన్ కాల్స్‌లో 3 శాతంగా ఉన్న ఈ కాల్స్.. ఈ ఏడాదిలో 7 శాతానికి పెరిగాయని నివేదికలో తెలియజేసింది. 2018లో స్పామ్ కాల్స్‌లో 6.1% పెరుగుదల చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే వ్యక్తిగత స్పామ్ కాల్స్ ఈ ఏడాదిలో 1.5% తగ్గాయని వెల్లడించింది.
91 శాతం కంపెనీలవే..
భారత్‌లోని స్పామ్ కాల్స్‌లో 91 శాతం టెలికం సర్వీసు ప్రొవైడర్లు, ఆపరేటర్ల నుంచి వస్తున్నవే. వివిధ ఆఫర్లు, బ్యాలెన్స్ రిమైండర్లకు చెందిన కాల్స్ చేస్తూ ఈ సంస్థలు విసిగిస్తున్నట్లు పేర్కొంది. స్కామ్ కాలర్ల వాటా 7 శాతంలో టెలీ మార్కెటర్ల కాల్స్
2 శాతం ఉన్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment